మణిపూర్ అల్లర్ల కట్టడికి కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం..!

The central government's key decision for the Manipur riots..!
The central government's key decision for the Manipur riots..!

జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపుర్ అట్టుడికిపోతోంది. ఇటీవలే అల్లర్లు కాస్త తగ్గుముఖం పట్టాయని అక్కడ ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించారు. ఇంటర్నెట్ పునరుద్ధరించడంతో గతంలో జరిగిన దారుణాలన్నీ ఒక్కొక్కటిగా ప్రపంచానికి తెలియడం మొదలైంది. అందులో ఇద్దరు విద్యార్థులను కిడ్నాప్ చేసి దారుణంగా హతమార్చిన ఘటన యావత్ దేశాన్ని కలవరపరిచింది. ఈ విద్యార్థుల హత్యతో మళ్లీ మణిపుర్ రావణ కాష్టంలా మారింది.

ఈ నేపథ్యంలో అక్కడ మళ్లీ ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. మరోవైపు మణిపుర్ కల్లోలాన్ని కట్టడి చేేసేందుకు కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక్కడి పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు ఓ పవర్ ఫుల్ కాప్​ను రంగంలోకి దించాలని డిసైడ్ చేసింది. ఇందులో భాగంగానే జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌ ఎస్‌ఎస్పీ రాకేశ్‌ బల్వాల్‌ను తన సొంత కేడర్‌ అయిన మణిపుర్‌కు బదిలీ చేసింది. తాజాగా కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

రాజస్థాన్‌కు వాసి అయిన రాకేశ్ బల్వాల్‌ 2012 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి.. మణిపుర్‌ కేడర్‌లో ఐపీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన .. 2018లో ఎన్‌ఐఏలో ఎస్పీగా పదోన్నతి పొంది.. 2019లో పుల్వామా ఘటనను దర్యాప్తు చేసిన ఎన్‌ఐఏ బృందంలో సభ్యుడిగా ఉన్నారు. ఆ దర్యాప్తులో కీలక పాత్ర వహించిన రాకేశ్​ 2021 డిసెంబరులో పదోన్నతిపై AGMUT (అరుణాచల్ ప్రదేశ్‌, గోవా, మిజోరం, కేంద్ర పాలిత ప్రాంతాలు) కేడర్‌కు బదిలీ అయి.. శ్రీనగర్‌ సీనియర్‌ ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా మణిపుర్​లో శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు రాకేశ్​ను తిరిగి సొంత కేడర్‌ పంపించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించినట్లు సమాచారం.