మణిపూర్ లో గత మూడు నెలలుగా అల్లర్లు భారతదేశ అంతర్గత భద్రతను ప్రశ్నిస్తున్నాయి. పక్కనే ఉన్న మయన్మార్ నుంచి వచ్చే కొన్ని శక్తులు ఈ అల్లర్లకు కూడా కారణమవుతున్నాయి. మణిపూర్ లోకి గత కొన్నేళ్లుగా మయన్మార్ నుంచి కుకీ తెగకు చెందిన వారు వచ్చి అక్కడి జనాభా స్వరూపాన్ని మార్చేస్తున్నారని మైయిటీలు ఆరోపిస్తున్నారు. కుకీలు, మైయిటీల మధ్య జరిగిన ఘర్షణల్లో వీరి పాత్ర కూడా ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు కూడా హెచ్చరించారు. ఈ రెండు తెగల మధ్య హింస కారణంగా 175 మంది చనిపోయారు. అనేక మంది వేరే ప్రాంతాలకు వలస వెళ్లారు. మెయిటీ ఎస్టీ హోదా అడగడంతో ఈ ఘర్షణలు మొదలయ్యా యి.
ఈ నేపథ్యంలో మణిపూర్, మయన్మార్ మధ్య కంచె ఏర్పాటు అర్జెంటుగా అవసరమని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ అన్నారు. పొరుగు దేశం మయన్మార్ నుంచి అక్రమ వలసదారుణలు అడ్డుకోవాలంటే త్వరగా కంచె ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ రోజు 70 కిలోమీటర్ల మేర కంచె ఏర్పాటు గురించి చర్చించినట్లు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైపజేషన్(బీఆర్వో ), రాష్ట్ర పోలీసులు, హోం శాఖ ముఖ్య కార్యదర్శితో సమావేశమైన బీరేన్ సింగ్.. భారత్-మయన్మార్ మధ్య ‘‘ప్రీ మూమెంట్ పాలన’’ను ముగించాలని కేంద్రాన్ని కోరారు.
మణిపూర్-మయన్మార్ మధ్య సరిహద్దుకు ఇరువైపుల నివసించే ప్రజలు ఎలాంటి పత్రాలు లేకుండా ఒకరి భూభాగంలోకి మరొకరు 16 కిలోమీటర్లు రావడానికి ఒప్పందం ఉంది. దీంతో అక్రమ వలసదారులు భద్రతా బలగాల కళ్లు కప్పుతున్నారని శనివారం ఆయన రాష్ట్ర రాజధాని ఇంఫాల్ లో విలేకరులతో అన్నారు. ఈ రోజు అధికారులతో సమావేశం నిర్వహించిన సీఎం సరిహద్దు వెంబడి అదనంగా 70 కిమీ సరిహద్దు కంచె నిర్మాణాన్ని ప్రారంభించే ప్రణాళికపై చర్చించారు. పొరుగుదేశం నుంచి అక్రమ వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణా పెరుగుతున్న దృష్ట్యా కంచె నిర్మాణం అత్యవసరంగా మారిందని ఆయన అన్నారు. తూర్పు మణిపూర్ లో 5 జిల్లాలు మయన్మార్ తో 400 కి.మీ సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ సరిహద్దుల్లో కేవలం 10 శాతానికి తక్కువగా కంచె వేశారు. మయన్మార్, మణిపూర్ మధ్య సరిహద్దు 1600 కిలోమీటర్లు ఉంది. అయితే కొండలు, నైసర్గిక స్వరూపం బాగా లేని కారణంగా అన్ని ప్రాంతాల్లో కంచె వేయడం సులభం కాదు. దీంతో కీలక ప్రాంతాల్లో కంచె వేయాలని అధికారులు భావిస్తున్నా రు.