ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోయింది

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీలు కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఇవాళ మహబూబ్‌నగర్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఎంపీ డీకే అరుణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆకాంక్ష మేరకు బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన తప్పుడు కులగణన అని విమర్శించారు. కేవలం ఎన్నికల కోసమే కులగణన అనే మాట మాట్లాడారని చెప్పారు. ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోయిందని ఎంపీ డీకే అరుణ విమర్శించారు.