ఫుట్ బాల్ ఆడిన ఆవు..వీడియో వైరల్

the cow that played football

ఫుట్‌ బాల్ ఆడేందుకు క్రీడాకారుల బృందం మైదానంలోకి వచ్చింది. ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌ మొదలైంది. ఆట కొనసాగుతుండగా మరో ప్లేయర్ నేనూ పుట్‌ బాల్‌ ఆడతానంటూ మైదానంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా..? మైదానంలోకి వచ్చింది వ్యక్తి కాదు ఓ ఆవు. అవును మీరు విన్నది నిజమే. క్రీడాకారులంతా ఫుట్ బాల్ ఆడుతుండగా ఆ బంతి వచ్చి ఆవు దగ్గర ఆగింది. ఆవు ఫుట్ బాల్ ప్లేయర్ లాగానే స్టిల్ ఇస్తూ ఆటలో చేరిపోయింది. మరో ప్లేయర్ ఆవు దగ్గరున్న బాల్ ను షాట్ కొట్టగా ఆవు వెంటనే ఆ బంతిని ఫాలో అవుతూ ఫుట్ బాల్ ఆడింది. ఆవు ఫుట్ బాల్ ఆడిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే మరోవైపు రెండు ఎద్దులు మార్కెట్ ప్రాంతంలో ఒకదానినొకటి ఛేజింగ్ చూస్తూ పోటాపోటీగా పోట్లాడుకున్నాయి.