5 నుంచి యాదాద్రిలో వరుణయాగం

Varunayagam in Yadadri

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఈ నెల 5 నుంచి 7 వరకు వరుణయాగం నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో గీత తెలిపారు. దేశమంతా వర్షాలు కురవాలని.. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వరుణయాగం నిర్వహిస్తున్నట్టు ఈవో చెప్పారు. కొండపైన శివబాలాలయం పక్కన యాగనిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.