విజ‌య‌వాడ నుంచి తొలి అంత‌ర్జాతీయ విమానా స‌ర్వీస్

The first international flight service from Vijayawada

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

న‌వ్యాంధ్ర‌లో మ‌రో కీల‌క ఘ‌ట్టం రేపు ఆవిష్కృతం కానుంది. గ‌న్న‌వరాన్ని అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంగా తీర్చిదిద్దుతామ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇచ్చిన హామీ నెర‌వేరుతోంది. గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం నుంచి అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీస్ మొద‌ల‌వుతోంది. రేపు గ‌న్న‌వ‌రం నుంచి తొలి అంత‌ర్జాతీయ విమానం దుబాయ్, షార్జాల‌కు బ‌య‌లుదేర‌నుంది. ఎయిరిండియా ఈ ఘ‌న‌త‌ను సొంతంచేసుకుంది. గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యంలో జ‌రిగే ఓ కార్య‌క్ర‌మంలో పౌర విమాన‌యాన శాఖ మంత్రి ఆశోక్ గ‌జ‌ప‌తి రాజు తొలి స‌ర్వీస్ ప్రారంభించ‌నున్నారు. దుబాయ్, షార్జాలకు ఈ విమానం న‌డుస్తుంది.

ఉద‌యం 8గంట‌ల‌కు ఎయిరిండియా విమానం ముంబై నుంచి బ‌య‌లుదేరి 9.45కు విజ‌య‌వాడ వ‌స్తుంది. త‌రువాత ఉద‌యం 10.30కు బ‌య‌లుదేరి ముంబై మీదుగా దుబాయ్, షార్జాల‌కు వెళ్తుంది. ముంబైకి, అక్క‌డి నుంచి యూఏఈకి వెళ్లే సౌక‌ర్యం క‌ల్పిస్తున్న ఈ ఫ్లైట్ కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని భావిస్తున్నారు. ప్ర‌యివేట్ విమాన యాన సంస్థ‌లు విజ‌య‌వాడ నుంచి ఇంట‌ర్నేష‌న‌ల్ స‌ర్వీసులు ప్రారంభించేందుకు సాహ‌సం చేయ‌లేక‌పోతోంటే… ఎయిర్ ఇండియా ముందుకు వ‌చ్చి తొలి స‌ర్వీస్ ప్రారంభిస్తుండ‌డం విశేషం. విజ‌య‌వాడ‌లో ఇప్ప‌టికే ఇమ్మిగ్రేష‌న్, క‌స్ట‌మ్స్ విభాగాలు ఏర్పాట‌య్యాయి.