స్వదేశీ సాంకేతికత ఆధారంగా ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించేందుకు కొత్త ఆవిష్కరణల దిశగా కృషి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా భారతదేశానికి అసాధారణమైన సాంకేతికతను అందించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పోఖ్రాన్ అణు పరీక్షల వెనక ఉన్న శ్రమను కొనియాడారు. ఇది మన దేశ శాస్త్రీయ సామర్థ్యాన్ని, సంకల్పాన్ని చాటిన అసాధారణ ఘట్టమని కిషన్‌రెడ్డి ప్రశంసించారు.
