రోజంతా ఏవో శబ్దాలు ఆ ఇంట్లో ఆ దెబ్బకు అదేదో దెయ్యం అని కూడా భయపడ్డారు. అయితే జోరీగలా జుమ్మంటూ వచ్చే ఆ సౌండ్‌కు ఆ ఇంట్లో విసుగుపోయారు. చివరికి ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో గ్రహించారు. బెడ్రూమ్ గోడ నుంచి ఆ శబ్దాలు వస్తున్నాయని తెలుసుకుని అసలు అక్కడ ఏముందో తెలుసుకోవాలని ఆ గోడ పగలగొట్టి చూసి షాకయ్యారు. ఎందుకంటే ఆ గోడ లోపల అందులో వేల సంఖ్యలో తేనెటీగలు కనిపించడంతో కంగారుపడ్డారు. వెంటనే తేనెటీగలు పట్టుకునే వ్యక్తికి ఫోన్ చేసి వాటిని బయటకు తీయించారు. ఈ ఘటన స్పెయిన్ లో చోటుచేసుకుంది.
ఓ జంట తమ ఇంట్లో వింత శబ్దాలు రావడం గమనించారు. గత రెండేళ్ల నుంచి ఈ శబ్దాలను వింటున్న ఆ జంట మధ్యలో ఫైర్ ఫైటర్స్‌కి కూడా ఫిర్యాదు చేశారు. అయితే, వారు పట్టించుకోలేదు. ఇటీవల శబ్దాలు మరీ ముదరడంతో అదెక్కడ నుంచి వస్తుందో తెలుసుకునేందుకు ప్రయత్నించగా చివరికి గోడ నుంచే ఆ శబ్దాలు వస్తున్నాయని తెలిసి పగలగొట్టి చూడగా అందులో తేనెటీగలు ఉన్నాయి.
వాటి సంఖ్య గణనీయంగా పెరగడం వల్ల శబ్దాలు కూడా ఎక్కువయ్యాయని తేనెటీగలు పట్టుకునే వ్యక్తి తెలిపాడు. అయితే అది మన లాంటి గోడ కాదు, ఎందుకంటే విదేశాల్లో చెక్కలతో గోడలు ఉంటాయి అందుకే ఏదో సన్నని కన్నం చూసుకుని అక్కడ గూడు పెట్టుకుని వేలల్లో సంతానాన్ని పెంపొందించుకున్నాయి.