తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా మూవీ ‘కంగువా’ దసరా కానుకగా రిలీజ్ కానున్నది . ఈ మూవీ ని దర్శకుడు శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా పై అంచనాలు పీక్స్ ల నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ మూవీ కి సంబంధించిన టీజర్ కి సాలిడ్ రెస్పాన్స్ రావడంతో ఈ మూవీ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా, నేడు సూర్య బర్త్ డే కానుకగా ఈ మూవీ నుండి ఫైర్ సాంగ్ లిరికల్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. సూర్య ఈ మూవీ లో రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తుండగా, అందులోని ట్రైబల్ పాత్రకి సంబంధించిన పాటగా ఈ ఫైర్ సాంగ్ ఉండనుంది. ”ఆది జ్వాల, అనంత జ్వాల, వైర జ్వాల..” అని అంటూ సాగే ఈ సాంగ్ కి దేవిశ్రీ ప్రసాద్ రాకింగ్ మ్యూజిక్ ని అందించాడు.
ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా అనురాగ్ కుల్కర్ణి, దీప్తి సురేశ్ లు ఈ పాటను పాడారు. ఈ మూవీ కు వెట్రి పళణిస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, కెఇ జ్ఞానవేల్ రాజా భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటిస్తోండగా బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ మూవీ ను అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.






