మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ‘విజేత’ చిత్రంతో పరిచయం అయిన విషయం తెల్సిందే. హీరోగా పరిచయం అయ్యేందుకు కళ్యాణ్ మూడు నెలల పాటు నటనలో శిక్షణ తీసుకున్నాడు. మరి కొన్ని రోజులు డాన్స్‌లో కొన్ని రోజులు యాక్షన్ సీన్స్‌కు శిక్షణ తీసుకోవడం జరిగింది.
విజేత చిత్రంలో కళ్యాణ్‌ను చూస్తే శిక్షణ ఏమాత్రం ఆయనకు సరిపోలేదు అనిపించింది. చిరంజీవి కూడా విజేత చిత్రం ప్రారంభంకు ముందే ఇంకొన్నాళ్లు నటనలో శిక్షణ తీసుకోవాలని కళ్యాణ్ దేవ్‌కు సూచించడాని సమాచారం. కాని కళ్యాణ్ మాత్రం ఆగకుండా హడావుడిగా సినిమాల్లోకి వచ్చేశాడు. హడావుడిగా వచ్చేసినందుకు ఫలితం ఇలాగే ఉంటుందని సినీ వర్గాల వారు కూడా కళ్యాణ్ తీరుపై విమర్శలు వ్యక్తం చేశారు. ఓనమాలు కూడా నటనలో తెలియని వ్యక్తి హీరో అయితే ఎలా అంటూ విమర్శకులు మరియు ప్రేక్షకులు సినిమాను తిప్పి కొట్టారు.
విజేత ఫ్లాప్ అయినా కూడా నిరాశ పడకుండా కళ్యాణ్ వెంటనే రెండవ సినిమాకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే మూడు నాలుగు కథలు విన్న కళ్యాణ్ దేవ్ చిరంజీవి అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ సమయంలోనే చిరంజీవి మరియు అల్లు అరవింద్‌లు చర్చించి కళ్యాణ్ దేవ్‌ను విదేశాలకు నటన మరియు దర్శకత్వంలో శిక్షణ పొందేందుకు పంపించాలని నిర్ణయించారు. దాంతో పాటు మార్షల్ ఆర్ట్స్ మరియు డాన్స్‌లో మెలకువలు నేర్చుకునేందుకు కనీసం సంవత్సరం పాటు సమయం కేటాయించాలని, వచ్చే ఏడాది దసరా తర్వాత రెండవ సినిమా మొదలు పెట్టవచ్చు అంటూ కళ్యాణ్‌కు సలహా ఇచ్చారట. దాంతో చేసేది లేక విదేశాలకు కళ్యాణ్ దేవ్ నటనలో శిక్షణ కోసం వెళ్లబోతున్నాడు. వచ్చే ఏడాది కళ్యాణ్ దేవ్ మూవీ ఉండనట్లే అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. కళ్యాణ్‌కు మాత్రం వెంటనే రెండవ సినిమా చేయాలని ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే కళ్యాణ్ కెరీర్ బాగుండేందుకే చిరు, అల్లు అరవింద్ ఈ నిర్ణయం తీసుకున్నారు.