“డబుల్ ఇస్మార్ట్” టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్!

The overwhelming response to the teaser of "Double Smart"!
The overwhelming response to the teaser of "Double Smart"!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ డబుల్ ఇస్మార్ట్(Double ismart). ఈ మూవీ కి సంబందించిన టీజర్ ని నిన్న రామ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు. టీజర్ కి ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. యూ ట్యూబ్ లో 24 గంటల్లో 10.5 మిలియన్స్ కు పైగా వ్యూస్ రాబట్టగా, అన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో కలిపి ఈ టీజర్ 15 మిలియన్స్ కు పైగా వ్యూస్ ని సొంతం చేసుకుంది. ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పాలి.

The overwhelming response to the teaser of "Double Smart"!
The overwhelming response to the teaser of “Double Smart”!

మరోసారి పూరి జగన్నాథ్ తన మార్క్ డైలాగ్స్ తో అందరిని ఆకట్టుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ లో ఉన్న మాస్ డోస్ కు డబుల్ మ్యాడ్ నెస్ ఈ టీజర్ లో చూడొచ్చు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీ త్వరలో థియేటర్ల లోకి రానున్నది .