ఏఎన్నార్ శతజయంతి వేడుకలో నాగార్జున ధరించిన షర్ట్ ఖరీదు అంతనా..?

ఏఎన్నార్ శతజయంతి వేడుకలో నాగార్జున ధరించిన షర్ట్ ఖరీదు అంతనా..?
Latest News

అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారి శతజయంతి వేడుకలు ఘనంగా జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. నాగేశ్వరరావు గారి శతజయంతి వేడుకకి నాగార్జున అన్నపూర్ణ స్టూడియోలో పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా హాజరై ఆయన చేతుల మీదుగా నే విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ శత జయంతి వేడుకల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు నాగార్జున .

అయితే శత జయంతి వేడుకలకు హాజరైన వారిని ఎలాంటి లోటు పాట్లు జరుగకుండా దగ్గర ఉండి అన్నీ చూసుకున్నారు నాగార్జున. ఈ సందర్భంగా నాగార్జున ధరించిన షర్ట్ గురించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వేడుకకు నాగార్జున ధరించిన షర్టు ధర గురించి నెటిజన్లు ఆరా తీయడం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున ధరించిన ఈ షర్ట్ ద్వారా దాదాపు 85 వేల రూపాయలు ఉన్నట్టు తెలుస్తుంది . ఈ కార్యక్రమానికి నాగార్జున వేసుకున్న టువంటి ఈ షర్ట్ బిగ్ బాస్ 5 వీకెండ్ లో వేసుకొని సందడి కూడా చేశారు. దీంతో ఇది కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయింది .

ఏఎన్నార్ శతజయంతి వేడుకలో నాగార్జున ధరించిన షర్ట్ ఖరీదు అంతనా..?
ANR , Nagarjuna

అయితే సాధారణంగా సెలబ్రిటీలు ఒకసారి వేస్కున్నటువంటి షర్ట్ మామూలుగా ఇతర కార్యక్రమాలకు వేసుకోవడానికి అంతగా ఇష్టపడరు. కానీ నాగార్జున తన తండ్రి శతజయంతి వేడుకల్లో భాగంగా ఇదివరకే బిగ్ బాస్ కార్యక్రమంలో వేసుకున్నటువంటి డ్రెస్ వేసుకొని రావడంతో ఈ విషయంపై నెటిజన్లు నాగార్జునను బాగా ట్రోల్ చేస్తున్నారు. నాగార్జున మరి ఇంత పిసినారినా బిగ్ బాస్ కార్యక్రమానికి వేసుకున్న షర్ట్ తన తండ్రి శతజయంతి వేడుకలకు వేసుకోవడం అవసరమా అని అంటూ కామోన్స్ చేయడం మొదలుపెట్టారు. సాధారణంగా నాగార్జున ఇంత చేసి పాత షర్ట్ ఎందుకు వేసుకుంటారు. ఆ షర్ట్ కొత్తదే అని తెలుస్తోంది. తండ్రి శతజయంతి వేడుక నాడు పాత షర్ట్ అస్సలు వేసుకోరని కొందరు అభిమానులు అన్నారు . ఇక ఈ విషయంపై నాగార్జున స్పందిస్తే కానీ ఒక క్లారిటీ రాదు. లేదంటే నాగార్జున వేసుకున్న షర్ట్ పై రకరకాల రూమర్సు వస్తూనే ఉంటాయి.