తమ దేశాన్ని తామే రక్షించుకోగలుగుతామని.. ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని ఇందిరమ్మ ఆనాడే స్పష్టం చేసిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన చరిత్ర గాంధీ కుటుంబంతోపాటు కాంగ్రెస్ పార్టీదని ఆయన పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం భారత జవాన్లకు అండగా నిలబడతామని.. అది తమ బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కానీ ప్రస్తుతం పహల్గామ్ ఘటనలో పాకిస్థాన్‌కు బుద్ది చెప్పడంలో ప్రధాని మోదీ వెనకడుగు వేశారన్నారు. అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్ చెబితే కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ చేసిన పరిస్థితి ఇప్పటి కేంద్ర ప్రభుత్వానిదని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.