దిశా ఘటనకు ముఖ్య కారణం మద్యం

దిశా ఘటనకు ముఖ్య కారణం మద్యం

వెటర్నరీ డాక్టర్ అయిన ప్రియాంక రెడ్డి అనే అమ్మాయిని నలుగురు నీచులు అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి, దాని తరువాత ఆమెను చంపేశారు. అంతటితో ఆగని నీచులు, ఆపై ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించడం జరిగింది. కాగా ఆ దారుణ ఘటనపై మన రెండు తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యప్తంగా ప్రజలు ఎంతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసారు.అయితే ఆ నీచులు చేసిన తప్పే వారి పాలిటి శాపముగా మారి, కేవలం పదిరోజుల్లోపే పోలీసుల నుండి తప్పించుకోబోయి వారి చేతిలోనే ఎన్కౌంటర్ కు గురయ్యారు.

అయితే ఆ వార్తతో ప్రజలందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేసారు. ప్రస్తుతం ఆ నలుగురు నిందితుల మృతదేహాల ఖననం విషయమై కోర్ట్ లో వాద ప్రతివాదాలు జరుగుతున్నాయి. ఇకపోతే నేడు ఈ దారుణ ఘటనపై బిజెపి ఎమ్యెల్యే రాజాసింగ్ కొంత ఆవేశంగా మాట్లాడారు. అసలు దిశా ఘటనకు ముఖ్య కారణం మద్యం అని, మన రాష్ట్రాల్లో అతి చిన్న వయసుల వారికి కూడా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరపడంతో లేత వయసులో ఉన్న యువకులు ఆ దుర్వ్యసనం బారిన పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని అన్నారు.

మద్యం సేవించిన వ్యక్తికి తప్పొప్పులు తెలియవని, కావున రాష్ట్రంలో విచ్చలవిడిగా అమ్ముడవుతున్న మద్యాన్ని కేవలం పెద్ద వయసున్న వారికే అమ్మాలని, అది కూడా కొన్ని పరిమితుల మీద అమ్మేలా చట్టాలు తీసుకురావాలని అన్నారు. రాష్ట్రంలో మధ్య అమ్మకాలపై సీఎం కేసీఆర్ సరిగ్గా నిర్ణయం తీసుకోకపోతే యువత మరింతగా ఆ మహమ్మారి బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవడం ఖాయం అని ఆవేదన వ్యక్తం చేసారు.