ఈరోజు జరగవలసిన తెలంగాణ కేబినేటి సమావేశం రద్దు..!

One man show..if KCR comes, war is one side..!
One man show..if KCR comes, war is one side..!

ఇవాళ జరగాల్సిన తెలంగాణ కేబినేటి సమావేశం రద్దు అయింది. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ జ్వరంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే తెలంగాణ కేబినేటి సమావేశం రద్దు అయిందని సమాచారం.అయితే.. ఇవాళ జరుగాల్సిన తెలంగాణ కేబినేటి సమావేశం రద్దు అయినట్లు సీఎంవో అధికారిక ప్రకటన చేసింది.

కాగా, ఇవాళ మంత్రి కేటీఆర్ వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు, వివిధ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఆయనతో పాటు మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లిలో పామాయిల్ పరిశ్రమ నిర్మాణానికి తొలత కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం పెద్దపమందడి మండలం బుగ్గపల్లి తండాలో మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రం, రాజపేటలో రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభిస్తారు.