భారీ అంచనాల మధ్య రాబోతున్న ‘దేవర’ మూడో పాట!

The third song of 'Devara' is coming amid huge expectations!
The third song of 'Devara' is coming amid huge expectations!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ సినిమా ‘దేవర’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ మూవీ ను దర్శకుడు కొరటాల పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఈ మూవీ నుంచి ఎప్పుడెప్పుడు ఎలాంటి అప్డేట్ వస్తుందా అని అభిమానులు ఏంటో ఆశగా ఎదురుచూస్తున్నారు.

The third song of 'Devara' is coming amid huge expectations!
The third song of ‘Devara’ is coming amid huge expectations!

ఈ క్రమంలోనే ఈ సినిమా లోని మూడో సాంగ్‌కు సంబంధించి ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఒక పోస్ట్ చేశారు. దేవర మూడో పాట ఇటీవల రిలీజ్ అయిన ‘చుట్టమల్లె’ సాంగ్‌ను మించి ఉంటుందని.. ఇందులో పాటతో పాటు ఆట కూడా ఉంటుందని ఆయన అన్నారు. అంతేగాక, ఈ పాటలో తారక్ డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ అని.. ఈ పాట ఎప్పుడొచ్చినా భీభత్సమే అని ఆయన చెప్పారు .

దీంతో ఇప్పుడు ‘దేవర’ సినిమా లోని మూడో పాట ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఏంటో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీ లో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు . అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్ కానున్నది .