ఏపీకి వాయుగుండం ముప్పు…!

The Threat To The AP Is Under Threat

భారత వాతావరణ శాఖ సూచన ప్రకారం. ఆంధ్రప్రదేశ్‌కు వాయుగుండం ముప్పు పొంచి ఉంది. తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖకు సూచించింది. అంతేకాక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందని తెలుస్తోంది. గురువారం రాత్రి లేదా 21వ తేదీ తెల్లవారు జామున కళింగపట్నం- పూరీ మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

west-bengal
అలాగే తీరం వెంబడి గంటకు తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కీ.మీ వేగం వరకు ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండేందున మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం ముప్పు ఉందనే హెచ్చరికలతో ఉత్తరాంధ్ర జిల్లాల అధికార యంత్రాంగాన్ని విపత్తుల శాఖ అప్రమత్తం చేసింది. తీర ప్రాంత ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. మరోవైపు హైదరాబాద్‌కు కూడా వర్షసూచన ఉంది. గురువారం వాతావరణం కొంచెం పొడిగా ఉన్నా.. శుక్రవారం వర్షం పడే అవకాశం ఉంది.

rains