ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న”లవ్ మీ” ట్రైలర్..!

The trailer of
The trailer of "Love Me" is particularly impressive..!

టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ హీరోగా రాబోతున్న హారర్ ప్రేమకథ “లవ్ మీ”. ఇఫ్ యు డేర్ అనేది ట్యాగ్‌లైన్. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య కథానాయికగా నటిస్తున్న ఈ మూవీ కి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. ఈరోజు ఒక ఈవెంట్‌లో మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ప్రేక్షకులని ఈ ట్రైలర్ చాలా బాగా ఆకట్టుకుంది. ట్రైలర్ ని చూస్తుంటే మూవీ లో మంచి కథతో పాటు ఎమోషన్స్ కూడా ఉన్నాయని అర్థం అవుతుంది .

The trailer of "Love Me" is particularly impressive..!
The trailer of “Love Me” is particularly impressive..!

ఏదైతే చేయకూడదు అని చెబుతారో… అలాంటి పనులే చేసే వ్యక్తిగా ఆశిష్ ఈ మూవీ లో నటిస్తున్నాడు. హీరో ఒక శిథిలావస్థలో ఉన్న భవనానికి వెళ్లి ఒక దెయ్యంతో ప్రేమలో పడతాడు. మానవుడు దెయ్యంతో ప్రేమలో పడాలనే ఆలోచనతో సాగిన ఈ ట్రైలర్ మొత్తానికి అందరిని ఆకట్టుకుంది. సాంకేతికంగా కూడా ఈ ట్రైలర్ చాలా చాలా బాగుంది. హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఎం ఎం కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీని ప్రకటిస్తారు.