యుద్దానికి సిద్ధం అంటున్న యువత!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆర్మీలో చేరేందుకు యువత ఉత్సహాంగా ఉన్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే కఠోర సాధన కూడా చేస్తున్నారు. ఆర్మీలో చేరేందుకు స్థానికంగా ఉన్న డిఫెన్స్‌ అకాడమీల నుంచి ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం భారత్‌-పాకిస్తాన్ ఉద్రిక్తతలను వారు క్షుణ్నంగా గమనిస్తున్నారు. భారత సరిహద్దుల్లో సైనికులు శత్రుదేశాలతో పోరాడుతున్న తీరును పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంతో యుద్ధం వస్తే స్థానికంగా తాము ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నాం మని చెబుతున్నారు.