తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ..

తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ జరిగింది. రాజ్‌భవన్‌లోని సుధర్మ భవన్‌లో 4 హార్డ్‌డిస్క్‌లు మాయమయ్యాయి. హెల్మెట్‌తో ఓ వ్యక్తి రాజ్‌భవన్‌లోకి వచ్చినట్లుగా సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. పంజాగుట్ట పోలీసులకు రాజ్‌భవన్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఈనెల 14వ తేదీన రాత్రి చోరీ జరిగినట్లుగా నిర్ధారణకు వచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కంప్యూటర్ హార్డ్‌వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.