Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మనం ఎన్నో అద్భుతమైన ఆలయాలు.. ఎన్నో వింతలను చూసి ఉంటాం,విని ఉంటాం.. కానీ.. పాము శివలింగానికి పూజచేసి, దాని చర్మాన్ని దేవుడికి మాలగ వదిలి వెళ్లడం ఎక్కడైనా చూసారా…?
తమిళనాడులోని తంజావూర్ జిల్లాలో, తిరునగేశ్వరం సమీపంలో, తెప్పేరుమనల్లూర్ లో ఒక ప్రముఖ దేవాలయం వెలసింది. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటంటే.. నిత్యం దేవాలయంలో ఉన్న శివ లింగానికి ఒక పాము పూజలు చేస్తూ ఉంటుంది. అయితే ఆ పాము ఎందుక ఇలా చేస్తుంది? దీని వెనుక గల కారణం ఏమిటి? ఆ పాము ఎవరినీ ఏమీ చేయదా…? ఇవన్నీ తెలియాలంటే మనం ముందుకు కొనసాగాల్సిందే..
ఈ శివాలయం తిరువరూర్ నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. 10 వ శతాబ్దంలో ఆదిత్య చోళ ఈ ఆలయాన్ని నిర్మించారు. తరువాత పాలకులు వారి చేర్పులతో దేవాలయాన్ని సవరించారు. తెప్పేరుమనల్లూర్ లో విశ్వనాథస్వామి తో వేదంతనాయకి ప్రధాన దేవతలుగా పూజింపబడుతున్నారు. ఆదిశేష శివుడు ఇక్కడ అనాధన శివ అనే కాకుండా,’రుద్రాక్ష కవచ’ తో కప్ప బడడంతో రుతురుక్షేశ్శ్వరడు అని కూడా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయo ,శివుడికిరుద్రాక్షతో పూజ జరిపిన ఏకైక ఆలయం.
నిత్యం సూర్యకాంతి, ఆ కిరణాలూ శివలింగాన్ని తాకడం ఒక అద్భుతమైన విషయంగా చెప్పబడినది.ఈ లింగం యొక్క శక్తి భారతదేశంలోని 12 జోతిర్లింగాలు కలయికఅవ్వడమేఈశివలింగo యొక్కప్రత్యేకత.
పురాణాల ప్రకారం, పాలు సముద్రము చిలికే సమయంలో, ప్రపంచాన్ని కాపాడటానికి శివడు తన కంఠం లో విషాన్ని నింపుకున్నాడు..అందుకే తన మెడ చుట్టూ సర్ప రాజు ఒక ఆభరణముగా ఉంటుంది. దీనికి నిదర్శనంగా ఒక కథనం మనం తెలుసుకుందాం..2010 జనవరి 16 న జరిగిన ఒక యదార్థ గాధ గా చెప్పబడిన ప్రత్యేకమైన కథ కలదు. ఆ కథలేమిటో క్షుణ్ణంగా తెలుసుకుందాం…
జులై 2009 లో దేవుని దగ్గర ఒక పెద్ద సర్పముని చూసారు ఆ ఆలయంలో వారందరు..ఆ తరువాత ఆలయ పూజారులు అక్కడ ఉన్న భక్తులు ఆ సర్పనికి పాలు సమర్పించారు. పాలు తాగి కాసేపట్లో అక్కడ నుంచి వెల్లిపోయింది. మరలా 2010 జనవరి 16 న ఉదయం 10 :30 సమయంలో సూర్య గ్రహణానికి ముందు ఆలయ అర్చకులు దేవునికి పూజలు చేయడానికి తలుపులు తీయగా…అదే పెద్ద సర్పము శివలింగాన్ని చుట్టి కనిపించింది..
అక్కడి పూజారులు, భక్తులు చూస్తూ ఉండగానే ఆ పాము దగ్గరలో ఉన్నా పవిత్ర వృక్షంగా కొలిచే ‘ “విల్వా వృక్షం” దగ్గరకి వెళ్ళింది. అక్కడి నుంచి బిల్వపత్రాలనుఒక్కొక్కటిగా సేకరించి గర్భగుడిలోకి ప్రవేశించి శివ లింగం పైన ఆకు తో పూజలు చేసింది. ఆ విధంగా మూడుసార్లు ఆ పాము శివునికి బిల్వపత్రాలని సమర్థించుకుంది.
బిల్వ పత్రాలను సమర్పించిన తరువాత శివలింగం దగ్గరికి వెళ్ళి తన చర్మాన్ని దేవుడికి మాలగా సమర్పించుకుని ..అక్కడి నుంచి వెళ్ళిపోయింది..ఆ పాము అక్కడ ఉన్న ఎవ్వరికీ ఎటువంటి హానీ చెయ్యలేదు.. పాము కూడా కుండలిని శక్తి అని పిలిచే నిశ్చలమైన శక్తిని సూచిస్తుంది. ఈ అద్భుతం అందరి భక్తుల్లో ఒక పరమపవిత్రమైన సంకల్పంగా మిగిలిపోయింది.అప్పటి నుంచి ఈ దేవాలయం ప్రాముఖ్యత దేశమంతటా వ్యాపించింది. ఈ విశిష్టమైన సంఘటన తరువాత అగ్రహారం లో పురుషులందరినీ నాగరాజన్, నాగలింగం, నాగనాథన్ అనే పేర్లతో పిలవబడుతున్నారు. అప్పుడే పుట్టిన మగ పిల్లలకిఅలాంటి పేర్లు పెడ్తున్నారు.
ఈ ఆలయానికి మరో ప్రాముక్యత , ప్రతేకత కూడా ఉన్నాయి.. ఇక్కడ స్వామిని కొలిస్తే పునర్జన్మ ఉండదు అని.. భక్తితో వచ్చి స్వామికి రుద్రాక్ష పూజ, లేక అభిషేకం చేసుకొంటే చేసిన పాపాలను స్వామి కడిగేస్తారని, ఈ భక్తులకి గట్టి నమ్మకం
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు కదా … అలా ఈ అద్భుతముఆపరమేశ్వరుడు మహిమ వల్లే జరిగిందని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు..
పంచారామాలలో, కుమారభీమారామము క్షేత్రం లోని ,శివలింగం కూడా 14 అడుగుల ఎత్తున రెండస్తుల మండపంగా ఉంటుంది.
నల్గొండ జిల్లా లో స్వయంభువు శంభులింగేశ్వర స్వామి ఆలయం ఉంది.ఈ లింగం పైన కుడివైపు వెనుక పక్క చిన్నగుంటలో నీరు ఉబికి బయటకు రాదు.స్వయంభూ శివలింగం ప్రతి సంవత్సరం ఎత్తు పెరుగుతూ ఉంటుంది.
అలాగే శివ ప్రాముఖ్యతలు ఒకటా..రెండా..ఎనో..ఎన్నెనో..మన దేశం లో ఉన్నాయి.మనం శివుడ్ని ఎంతో శక్తివంతమైన వ్యక్తిగా చూస్తాము. అదే సమయంలో ఆయనను ప్రాపంచిక లౌక్యం తెలియని వానిగా కూడా అనుకుంటాము. అందుకే శివుడి రూపాల్లో ఒకదాన్ని భోళా శంకరుడు అంటారు.
ఇదే కాకుండా శివలింగం ముందు ఒక పెద్ద గొయ్యి ఉంటుంది..దీని వెనుక ఒక పురాణ కథ ఉన్నది..శివుని అడుగుల కొరకు అన్వేషణ చేసేందుకు భూమి లోకి వెళ్లడానికి విష్ణువు ఈ రంధ్రం ఏర్పరిచినట్లు తెలుస్తుంది. దీని ద్వారా విష్ణువు బయటికి వచ్చాడని స్థల పురాణం చెబుతోంది. ఇప్పటికి ఆ రంధ్రం మనం చూడవచ్చు కాని కొన్ని సంవత్సరాల క్రితం ఆ రంధ్రం రాతితో మూసివేయబడింది.
రాహువు గ్రహం కోసం ఆలయం నవగ్రహ ఆలయాలలో ఒకటిగా లెక్కించబడుతుంది. రాహు అభిషేకం కోసం ఒక ప్రత్యేక క్యాలెండర్ కూడా ఉంది. రాహు దోషం ఉన్నవాళ్లు ఇక్కడ ఉండే రాహువు విగ్రహనికి పాలతో పూజ చేసినట్లయితే..ఆ దోషం తొలుగుతుంది అనడానికి నిదర్శనంగా ఆ పాలు నీలి రంగులోకి మారుతాయి. ఇది దూర ప్రాంతాల భక్తులను బాగా ఆకర్షిస్తుంది.
ఉదయం, మధ్యాహ్నం, సాయంత్ర సమయాలలో మూడు ఆలయాలలో అనగా నాగేశ్వరం, తిరునాగేశ్వరం, తిరుపంపురం దేవుళ్ళకిపూజ చేయాలని అక్కడి వారందరి నమ్మకం. కాబట్టి ఇక్కడ దేవుళ్ళకి నిత్యం పూజలు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి..
ఇదే కాకుండా ఉషాత్కాలం ఉదయం 6 గంటలకు, ఉదయపూర్ ఉదయం 9 గంటలకు, ఉదయమళవారం ఉదయం 1:00 గంటలకు, ఉదయపూర్ ఉదయం 5 గంటలకు, సాయారక్కి ఉదయం 7 గంటలకు, మరియు అర్ధ జమాం రాత్రి 9:00 చేస్టారు..
అదేవిధంగా దేవుడికి అభిషేకం, అలంకరణ, ఆహార సమర్పణ, అరాదనం మొదలైనవి జరుపుతూ ఉంటారు. విగ్నేశ్వర, షణ్ముగ, నవగ్రహ విగ్రహాలే కాకుండా తూర్పు వైపున ఒక ఆలయo కూడా ఉంది. దేవాలయం యొక్క శక్తి రాహు / కేతు దోషాలను తొలగించటం, సంతానం లేని జంటలకి ప్రయోజనం కలిగించేందుకు చాలా ఎక్కువగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.
ప్రయాణ సమాచారం: తెప్పేరుమనల్లూర్, గ్రామం తిరునగేశ్వరం రైల్వే స్టేషన్ సమీపంలో ఉంది. బస్సు లేదా రైలు ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఆ తర్వాత కుంబకోణం నుంచి తెప్పరంమల్లూర్ శివ దేవాలయం 6 కిలోమీటర్లు.
విమాన మార్గం: తెప్పేరుమనల్లూర్ సమీప విమానాశ్రయం 44.8 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంజావూర్ ఎయిర్ ఫోర్స్ లో గలదు..