ఆ రాష్ట్రాల్లో సీఎంగా కొత్త వారికే అవకాశం.. ఎంపికపై మోదీ ఇంట్లో చర్చ

Madhya Pradesh CM's selection is today... Will Shivraj Singh get another chance?
Madhya Pradesh CM's selection is today... Will Shivraj Singh get another chance?

5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వేళ కొత్త ప్రభుత్వాల ఏర్పాటుపై గెలిచిన పార్టీలు దృష్టి పెట్టాయి. ఈ నేథ్యంలోనే బీజేపీ తాను గెలిచిన మూడు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ లకు ముఖ్యమంత్రులను ఎంపిక చేసే పనిలో బిజీ అయింది.

ఈ మూడు రాష్ట్రాలకు కొత్త ముఖాలను సీఎంలుగా నియమించాలని బీజేపీ హై కమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ 3 రాష్ట్రాలకు సీఎంలను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎంలను ఎంపికపై చర్చించేందుకు మంగళవారం రోజున ప్రధాని మోదీ నివాసంలో నాలుగున్నర గంటల పాటు భేటీ జరిగింది.

ఈ భేటీకి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హాజరయ్యారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ బీజేపీ ఇన్‌ఛార్జ్‌లతో అమిత్‌ షా, నడ్డా సమావేశమయ్యారు. కేంద్ర నాయకత్వం నియమించనున్న పరిశీలకులు ఈ మూడు రాష్ట్రాల్లో ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమై సీఎంల ఎంపికపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో త్వరలోనే ఈ రాష్ట్రాలకు సీఎం అభ్యర్థులను ప్రకటించనున్నారు.