సుమకు సుమే సాటి

సుమకు సుమే సాటి

తెలుగు టెలివిజన్ తెరపై నంబర్ వన్ యాంకర్ ఎవరు అనగానే టక్కున గుర్తొచ్చే పేరు యాంకర్ సుమ. వాస్త‌వానికి టాలీవుడ్ యాంకర్లలో సుమకంటూ ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఒక‌టి రెండు కాదు.. రెండు ద‌శాబ్దాలుగా టెలివిజ‌న్ రంగాన్ని మ‌కుటం లేని మ‌హారాణిగా ఏలేస్తుంది సుమ‌. టీవీ షోలే కాదు.. సినిమా ఈవెంట్స్‌కు కూడా సుమ యాంకరింగే కావాలని చాలామంది హీరోలు కోరుకుంటారు. సుమ నో అంటే తప్ప ఆ ఛాన్స్ మరొకరికి వెళ్లదు. అంతగా ఆమె యాంకరింగ్ కోసం ఇండస్ట్రీకి చెందిన పెద్దలు మరియు స్టార్ హీరోలు ఆరాటపడతారు.

ఇక‌ రోజుకో కొత్త యాంక‌ర్ వ‌చ్చి గ్లామ‌ర్ షోల‌తో గ‌ట్టి పోటీ ఇస్తున్నా.. సుమకు సుమే సాటి.. ఆమెకు లేరు ఎవ‌రు పోటీ అన్న చందంగా దూసుకుపోతోంది. పేరుకు మలయాళీ అయినా.. తెలుగు అనర్గళంగా మాట్లాడుతూ బుల్లితెరను ఏలేస్తోంది. ఈవెంట్లు, రియాలిటీ షోలు.. గేమ్ షోలు.. ఆడియో ఫంక్షన్లు ఇలా ఒకటేమిటి అన్నింటికీ కూడా సుమ హోస్టుగా చేయ‌డం అంతే మామూలు విష‌యం కాదు. అలాగే తెలుగు, మలయాళంలతో పాటు హిందీ మరియు ఆంగ్ల భాషలలోను మాట్లాడగలదు. యాంకర్ సుమ డిమాండ్లకు సినీ నిర్మాతల జేబులకు చిల్లు పడుతున్నట్టు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.

ఒక్కో సినిమా రిలీజ్ ఫంక్షన్‌కు సుమ రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు వసూలు చేస్తున్నట్టుచెబుతున్నారు. అయితే, దీంతోపాటు జీఎస్టీ కూడా నిర్మాతల దగ్గరే వసూలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో యాంక‌ర్ సుమ‌కు మ‌రీ ఇంత డిమాండా అంటూ నిర్మాత‌లు ల‌బోదిబో మంటున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. మ‌రోవైపు యాంకర్ సుమ రెమ్యునరేషన్ ఎక్కువ అనుకుంటే.. దానికి జీఎస్టీ కూడా నిర్మాతలే కట్టాలంటే డిమాండ్ చేస్తోంద‌ట‌. దీంతో టాలీవుడ్ నిర్మాతలకు తడిసి మోపెడవుతోందని సమాచారం. ఈ క్రమంలోనే సుమను పక్కన పెట్టి.. ఆమె కన్నా తక్కువకే హోస్టింగ్ చేసే మిగతా వారితో సరిపెట్టుకోవాలని చూస్తున్నారట.