సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ ఘటనపై ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ స్పందించారు. ఈ ఘటనకి అల్లు అర్జున్ ని నిందించాల్సిన అవసరం లేదని… ఎక్కువ మంది జనాలు రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని ఆయన అన్నారు.
దక్షిణాది ప్రేక్షకులకి తమ అభిమాన హీరోలపై అభిమానం ఎక్కువగా ఉంటుందని బోనీ కపూర్ చెప్పారు. తమిళ స్టార్ అజిత్ నటించిన ఒక సినిమాకి అర్ధరాత్రి షోకు తాను వెళ్లానని… దాదాపు 20 వేల మంది థియేటర్ దగ్గర ఉన్నారని… సినిమా థియేటర్ వద్ద అంతమందిని చూడటం తనకు అదే తొలిసారని తెలియచేసారు . సినిమా పూర్తయ్యాక తెల్లవారుజామున 4 గంటలకి బయటకు వచ్చినప్పుడు కూడా అంతే మంది ప్రేక్షకులు థియేటర్ బయట ఎదురు చూస్తున్నారని చెప్పారు.
చిరంజీవి, రజనీకాంత్, రామ్ చరణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల మూవీ లకు ప్రేక్షకులు ఇలాగే వస్తారని బోనీ కపూర్ అన్నారు. జనాలు ఎక్కువగా వచ్చినందుకే సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకుందని తెలియచేసారు .