ఛత్తీస్‌ఘడ్ తెలంగాణ సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ చర్యలపై రేవంత్‌రెడ్డి తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. రేవంత్‌రెడ్డితో నిన్న శాంతి చర్చల కమిటీ భేటి అయింది. ఈ భేటిలో రేవంత్‌రెడ్డి దృష్టికి పలు కీలక విషయాలను నేతలు తీసుకువచ్చారు. సామాజిక కోణంలోనే నక్సలిజాన్ని చూస్తామని రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయడానికి తమ కేబినెట్‌లోని మంత్రులతో చర్చించిన తర్వాతే ఓ నిర్ణయానికి వస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.