దేశీయ స్టాక్ మార్కెట్లు అద్భుతమైన రికవరీ సాధించాయి. నిఫ్టీ 3 శాతానికి పైగా పెరిగింది. ఇంట్రాడే కనిష్ట స్థాయిల నుంచి 500 పాయింట్లకు పైగా పైకి ఎగిసింది. అదేవిధంగా నిఫ్టీ 50 ఇండెక్స్‌తో పాటు నిఫ్టీ మిడ్‌క్యాప్, నిఫ్టీ స్మాల్‌క్యాప్ సూచీలు కూడా 2.86 శాతం, 2.51 శాతం లాభాలు పండించాయి. ఈ పాజిటివిటీతో భారత వొలటాలిటీ ఇండెక్స్ 10 శాతానికి పైగా క్రాష్ అయింది.
అన్ని రంగాల సూచీలు నేడు లాభాలు పండించాయి. టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, శ్రీ సిమెంట్స్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. నేడు కేవలం రెండు స్టాక్స్ మాత్రం నష్టాలు పాలయ్యాయి. సిప్లా, ఓఎన్జీసీ స్టాక్స్ మాత్రమే మంగళవారం బలహీనంగా ట్రేడయ్యాయి. ఈ బుల్లిష్‌నెస్‌తో మార్కెట్ ర్యాలీలో పాల్గొంటూ కొన్ని స్టాక్స్ కనిష్ట స్థాయిల నుంచి కోలుకున్నాయి. కనిష్ట స్థాయిల వద్ద ఈ స్టాక్స్‌లో కొనుగోళ్లు కనిపించాయి. తదుపరి సెషన్లో ఇవి ట్రేడయ్యే అవకాశం ఉంది.