ఏపీ, తెలంగాణలో రెడ్, ఆరెంజ్ జోన్లు ఇవే..!

కరోనా కేసుల తీవ్రతను బట్టి కేంద్ర ప్రభుత్వం రెడ్ జోన్, ఆరంజ్ జోన్, గ్రీన్ జోన్ లుగా విభజించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో అధికారులు పరిస్థితులను బట్టి లాక్ డౌన్ నిబంధనలను అమలు చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులను మదింపు చేసిన కేంద్రం, రాష్ట్రంలోని రెజ్ జోన్లను, ఆరంజ్ జోన్ల వివరాలను వెల్లడించింది. ఇదే సమయంలో రెండు వారాల క్రితం గుర్తించిన 170 హాట్ స్పాట్స్ సంఖ్యను 129కి తగ్గించింది.

ముఖ్యంగా తెలంగాణలోని రెడ్‌ జోన్ల విషయానికి వస్తే… హైదరాబాద్‌, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికరాబాద్‌, వరంగల్‌ అర్బన్ జిల్లాలు ఉన్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో ఆరంజ్ జోన్ల సంఖ్య 18కి పెరిగింది. వాటి ఒకసారి మనం చూసినట్లైతే… నిజామాబాద్, జోగులాంబ, నిర్మల్‌, నల్గొండ, అదిలాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, ఆసీఫాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌ నగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్‌, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, నారాయణపేట, మంచిర్యాల ప్రాంతాలు ఉన్నాయి. ఇదే సమయంలో మిగతా తొమ్మిది జిల్లాలైన పెద్దపల్లి, నాగర్‌ కర్నూల్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, సిద్దిపేట, వరంగల్‌ రూరల్‌, వనపర్తి, యాదాద్రి భువనగిరి గ్రీన్ జోన్లుగా కేంద్రం స్పష్టం చేసింది.

అదేవిధంగా ఏపీలో కూడా కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లా, నెల్లూరు, చిత్తూరును రెడ్‌జోన్లుగా ప్రకటించించింది. అలాగే.. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లా, విశాఖ జిల్లాలను ఆరెంజ్‌ జోన్లుగా వెల్లడించింది. ఇప్పటి వరకు ఎలాంటి కరోనా కేసులు నమోదు కాని.. విజయనగరం జిల్లాను గ్రీన్‌ జోన్‌గా కేంద్రం ప్రకటించింది.