‘ఇది నాకు చిన్న బ్రేక్ మాత్ర‌మే’ – విశ్వ‌క్ సేన్

'This is just a short break for me' - Vishwak Sen
'This is just a short break for me' - Vishwak Sen

మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ తాజాగా త‌న కొత్త మూవీ ‘లైలా’ ను పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ లో విశ్వ‌క్ తొలిసారి ఒక లేడీ గెటప్ లో క‌నిపిస్తాడు. దీంతో ఈ మూవీ లో ఆయ‌న లుక్స్ ప‌రంగా ఎలా ఉండ‌బోతున్నాడా అని అభిమానులు ఆస‌క్తిగా చూస్తున్నారు.

అయితే, రీసెంట్ గా విశ్వ‌క్ త‌న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని డియాక్టివేట్ చేశాడు. ఆయ‌న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎందుకు డియాక్టివేట్ చేశాడా అని అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. ఈ క్ర‌మంలో త‌న అభిమానుల‌కు ఒక క్లారిటీ ఇచ్చాడు ఈ యంగ్ హీరో.

'This is just a short break for me' - Vishwak Sen
‘This is just a short break for me’ – Vishwak Sen

”గ‌తకొద్ది రోజులుగా నా ఇన్ట్సాగ్రామ్ అకౌంట్ ని ఎందుకు డియాక్టివేట్ చేశాను అని అభిమానుల నుండి వ‌రుస‌గా మెసేజ్ లు వ‌స్తున్నాయి.. నేను కొద్దిరోజులు సోష‌ల్ మీడియాకి దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాను. నాకు ఏదో హాని జ‌రుగుతుంద‌ని ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం లేదు. ఇందులో భాగంగా నా ఇన్ట్సాగ్రామ్ ని డియాక్టివేట్ చేశాను. నా ట్విట్ట‌ర్ హ్యాండిల్ ను కూడా నా టీమ్ మేనేజ్ చేస్తుంది. సోష‌ల్ మీడియాలో ఉంటేనే జీవితం ముందుకు సాగుతుంద‌ని కాదు.. అందుకే ఈ సోష‌ల్ మీడియాని కొంత‌వ‌ర‌కే సీరియ‌స్ గా తీసుకోండి. నేను నా నెక్ట్స్ మూవీ రిలీజ్ త‌రువాత తిరిగి సోష‌ల్ మీడియాలోకి రావ‌చ్చు, రాక‌పోవచ్చు.” అని అంటూ విశ్వ‌క్ క్లారిటీ ఇచ్చాడు.