మోక్షజ్ఞ ఎంట్రీపై తారక్, కళ్యాణ్ రామ్ ల అభిప్రాయం ఇదే!

This is Tarak and Kalyan Ram's opinion on Mokshajna's entry!
This is Tarak and Kalyan Ram's opinion on Mokshajna's entry!

నేడు నందమూరి కుటుంబం నుంచి చాలా కాలంగా ఎదురు చూస్తున్న యువ హీరో మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై అఫీషియల్ గా అప్డేట్ వచ్చిన సంగతి మాత్రం తెలిసిందే. టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా భారీ మూవీ చేసి టాలీవుడ్ డెబ్యూ ఇవ్వనున్నారు . అయితే మోక్షజ్ఞకి తెలుగు మూవీ ఆడియెన్స్ నుంచి సహా తెలుగు మూవీ ప్రముఖుల నుంచి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నారు.

అయితే మోక్షు ఎంట్రీపై తన సోదరులు టాలీవుడ్ స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ లు కూడా స్పందించారు. మరి తారక్ మోక్షజ్ఞ ఎంట్రీపై పోస్ట్ చేస్తూ మూవీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తున్న మోక్షజ్ఞకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్ని అలాగే తాత గారి ఆశీస్సులు నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపై ఎప్పుడూ ఉంటాయి హ్యాపీ బర్త్ డే మోక్షు అని అంటూ తారక్ బ్యూటిఫుల్ పోస్ట్ ని పెట్టారు .

This is Tarak and Kalyan Ram's opinion on Mokshajna's entry!
This is Tarak and Kalyan Ram’s opinion on Mokshajna’s entry!

అలాగే కళ్యాణ్ రామ్ పోస్ట్ చేస్తూ మోక్షజ్ఞకి టిన్సెల్ టౌన్ లోకి ఆహ్వానం పలుకుతున్నాను అని తాతగారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను… అని అంటూ పోస్ట్ చేసారు . ఇలా ఇద్దరు అన్నలు కూడా మోక్షజ్ఞ ఎంట్రీపై పోస్టులు చేయడం అభిమానులను మరింత ఆనందానికి కారణం అయ్యింది.