రోజా , పురందేశ్వరికి అక్కడ తేడా వచ్చింది. 

this is the reason between roja and purandeswari clash

కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి , వైసీపీ ఎమ్మెల్యే రోజా పేర్లు మదిలో మెదలాగానే వీళ్ళు సీఎం చంద్రబాబుని ఈ రోజు ఏ రేంజ్ లో ఎటాక్ చేస్తారా అని జనం ఎదురు చూస్తుంటారు. వాళ్ళు పని చేస్తున్న పార్టీలు వారికి ఆ పని అప్పజెప్పాయో లేక సొంత అభిప్రాయాల్ని బలంగా వినిపిస్తున్నారో గానీ మొత్తానికి వీళ్ళ బాబు వ్యతిరేకత తెలుగు జనాల మెదడులో బలమైన ముద్రే వేసింది. ఈ ఇద్దరినీ కౌంటర్ చేయడానికి టీడీపీ ఎన్నో ప్రయత్నాలు చేసింది గానీ మాటల తూటాలు విసరడంలో మాత్రం వీరిదే పై చేయి అవుతూ వస్తోంది.

ఇదే విషయం ఇటీవల విజయవాడలో టీడీపీ నాయకులు కొందరు సమావేశం అయినప్పుడు ప్రస్తావనకు వచ్చిందట. ఇంతలో ఓ సీనియర్ నాయకుడు ఆ ఇద్దరి మధ్య ఏ పోలిక లేదని , వారి వల్ల టీడీపీ కి మేలు జరుగుతుందని చెప్పడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారట. అదెలా అని అడిగినప్పుడు ఆ నాయకుడు ఇచ్చిన జవాబుకి అంతా ఎస్ అని తల వుపాల్సివచ్చిందట. ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటో తెలుసా…” చంద్రబాబుని విమర్శించే విషయంలో రోజా , పురందేశ్వరి మధ్య పోలిక ఉన్నప్పటికీ రాజకీయంగా వారి మధ్య భిన్న దారులు . ఎందుకంటే రోజా జాతకమో లేక టెంపెరమెంట్ వల్లో గానీ ఆమె ఎప్పుడూ ప్రతిపక్షం వైపే ఉండి పోతారట.

ఇక పురందేశ్వరి ఎప్పుడూ అధికార పక్షం వైపే ఉండిపోడానికి చూస్తారట. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ లో , ఆ తర్వాత బీజేపీ లో ఆమె ప్రయాణాన్ని గమనిస్తే చాలు. వీరి మధ్య ఇంకో వైరుధ్యం ఏమిటంటే …రోజా వున్న పార్టీ అధికారంలోకి రాదట. పురందేశ్వరి అధికారంలో వున్న పార్టీలో చేరినా ఆ పై సదరు పార్టీ పూర్తిగా దెబ్బ తినిపోతుందట. ఇక వ్యక్తిగతంగా వారికి వున్న ఇబ్బందుల రీత్యా ఆ ఇద్దరూ ఎన్నడూ టీడీపీ లోకి వచ్చే అవకాశం లేదు . దీన్ని బట్టి ఆ ఇద్దరూ టీడీపీకి మేలు చేస్తున్నట్టా ,లేదా” అని ఆ నాయకుడి ప్రశ్నకు ముందుగా నోరెళ్లబెట్టిన వాళ్ళు ఆపై చప్పట్లతో అతని విశ్లేషణకు అభినందనలు తెలిపారట. ఇదండీ రోజా , పురందేశ్వరి మధ్య తేడా..నిజమే అనిపిస్తోంది కదూ!