ఇవాళ పుట్టపర్తి పర్యటనకు సీఎం జగన్‌…షెడ్యూల్‌ ఇదే

Election Updates: Birth certificate is now mandatory in AP
Election Updates: Birth certificate is now mandatory in AP

ఇవాళ పుట్టపర్తి పర్యటనకు సీఎం జగన్‌ పయనం కానున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌ రిలీజ్‌ చేశారు అధికారులు. ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టపర్తి కి హెలికాప్టర్‌ మార్గంలో పర్యటించనున్నారు.

ఇక షెడ్యూల్‌ ప్రకారం…ఇవాళ ఉదయం 9:30 గంటలకు గన్నవరం విమానాశ్రయంలో బయలుదేరి 10: 15 గంటలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ సత్యసాయి విమానాశ్రయం చేరుకోనున్నారు. 10:40 గంటలకు ముఖ్యమంత్రి జగన్‌ వై జంక్షన్ లో ఏర్పాటు చేసిన సభాస్థలికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12:15కి రైతులకు వైయస్సార్ భరోసా, పిఎం కిసాన్ నిధులను ముఖ్యమంత్రి జగన్‌ రైతుల ఖాతాలో జమ చేయనున్నారు.

ముఖ్యమంత్రి రాక సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక ఇవాళ వరుసగా ఐదో ఏడాది రెండో విడతగా ఒక్కొక్కరికి రూ. 4,000 చొప్పున ఆర్ధిక సహాయం చేయనున్నారు. దీంతో 53.53 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనుంది. ఈ సందర్భంగా రూ.2,204.77 కోట్ల రూపాయలను సీఎం జగన్‌ రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.