ఏపీ పీఏసీలో అనుకోని పరిణామం

Thota Thrimurthulu And Pilli Subhash Chandra Bose Got In PAC

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి అసెంబ్లీలో చాలా ప్రాధాన్యం ఉంది. ప్రబుత్వాన్ని నేరుగా నిలదీసే హక్కుంది. ఇలాంటి కమిటీలో ప్రధాన ప్రత్యర్థులకు చోటు దక్కడం విశేషంగా మారింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ప్రత్యర్థులు తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్ చంద్రబోస్ కు పీఏసీ సభ్యత్వాలు దక్కాయి.

ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికే ఇష్టపడని వీరిద్దరూ.. పీఏసీలో ఏం చర్చిస్తారని జోకులు పేలుతున్నాయి. కీలక సమస్యలతో ఏపీ సతమతమౌతున్న తరుణంలో.. ప్రభుత్వానికి కీలక సూచనలు చేయాల్సిన పీఏసీలో ప్రత్యర్థులు తిట్టుకుంటారేమోననే టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే పీఏసీకి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చైర్మన్ గా ఉన్నారు.

బుగ్గనకు విషయ పరంగా లోతైన అవగాహన ఉన్నా.. ఆయన్ను వీరిద్దరూ పనిచేయనివ్వరని అంటున్నారు. టీడీపీ త్రిమూర్తుల్ని ఎంపిక చేస్తే.. వైసీపీ పిల్లిని దించడం వ్యూహాత్మకమే అంటున్నారు. ఇప్పటివరకూ అసెంబ్లీలో జరిగిన మాటల యుద్ధం ఇక పీఏసీలోనే తప్పదనే మాట వినిపిస్తోంది.

మరిన్ని వార్తలు:

అఖిలప్రియ ప్రచారానికే పరిమితమా..?

కెసిఆర్ భయానికి ఆ సీక్రెట్ మీటింగ్ కారణమా ?

విక్రమ్ గౌడ్ ను కాల్చారా..? కాల్చుకున్నాడా..?