తెలంగాణలో ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను జారీచేసింది. మాస్క్ ధరించకుంటే వెయ్యి రూపాయల జరిమానాను విధించనున్నట్లు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఒమిక్రాన్ వైరస్ ఇప్పటికే 20కి పైగా దేశాలలో వ్యాపించిన సంగతి తెలిసిందే.
బహిరంగ ప్రదేశాల్లో, ఆఫీసుల్లో మాస్క్ నిబంధన అమలయ్యేలా చూడాలని వైద్యారోగ్యశాఖ ఆదేశాలు జారీచేసింది. అదే విధంగా బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు.. ఎక్కడికి వెళ్లిన వ్యాక్సినేషన్ పత్రం తప్పనిసరిగా అమలయ్యేలా చూస్తామన్నారు.
రిస్క్ దేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన 325 మంది ప్రయాణికులకు పరీక్షలు చేయడం జరిగిందని.. వీరిలో 35 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ వచ్చిందని హెల్త్ డైరెక్టర్ తెలిపారు. ఆమెకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. అదే విధంగా, జీనోమ్ సిక్వెన్స్కి నమునాలు పంపించామని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రజలందరు తప్పకుండా మాస్క్ ధరించి, కరోనా నిబంధనలు విధిగా పాటించాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సూచించారు.