జగిత్యాల పట్టణంలోని గాంధీనగర్‌లో గురువారం విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న గుట్టవద్ద గల ధర్మసముద్రం చెరువులో దూకి ముగ్గురు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ఇద్దరికి వివాహం అవ్వగా, మరో యువతి ఇంటర్ చదువుతోంది
మృతులు గంగాజల దేవి, మల్లిక, వందనలుగా పోలీసులు గుర్తించారు. వారి ఆత్మహత్యలకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.