గన్నవరం మండలం కేసరపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి లారీ బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు. మృతులను తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరానికి చెందిన ఒకే కుటుంబంలోని రాజ్యలక్ష్మి(29), శ్రీనివాస్(27), రోహిత్(2)లుగా పోలీసులు గుర్తించారు.
లారీని క్లీనర్ నడపడం వల్ల ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. గన్నవరం పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది ప్రమద స్ధలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. హైవే పెట్రోలింగ్ సిబ్బంది క్రేన్ సాయంతో లారీని బయటకు తీస్తున్నారు. మృతి చెందిన వారిని పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.