విమానాశ్రయంలోకి ప్రవేశించిన చిరుతపులి

విమానాశ్రయంలోకి ప్రవేశించిన చిరుతపులి

డెహ్రాడూన్ జాలీ గ్రాంట్ విమానాశ్రయంలోకి ప్రవేశించిన ఓ చిరుతపులిని బుధవారం బోనులో బంధించినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అటవీ ప్రాంత నుంచి విమానాశ్రయ ప్రాంగణంలోకి వచ్చిన చిరుత విమాన రాకపోకల భారీ శబ్దాలకు భయపడి అక్కడే ఉన్న కొత్త టెర్మినల్ భవనం సమీపంలోని ఓ పైపులో దాక్కుందని, దాదాపు పది గంటలు అందులోనే ఉండిపోయిందని సబ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి జి.ఎస్.మార్తోలియ అన్నారు.

మంగళవారం సాయంత్రం చివరి విమానం బయల్దేరిన తరువాత శబ్దాలు తగ్గడంతో చిరుత బయటకి వచ్చి అక్కడి సిబ్బందిని భయాందోళనకు గురిచేసింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు దాదాపు 10 గంటలు శ్రమించి చిరుతను బోనులో బంధించారు. చిరుతపులిని డెహ్రాడూన్ అటవీ విభాగానికి చెందిన బాడ్కోట్ పరిధిలో ఉంచారు, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిపుణులు దానికి సంబంధిత పరీక్షల తరువాత అడవిలోకి విడుదల చేస్తారని డెహ్రాడూన్ డిఎఫ్ఓ రాజీవ్ ధీమన్ చెప్పారు.