ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులుల హల్ చల్ చేస్తున్నాయి. జనాల్ని భయ బ్రాంతులకుగురి చేస్తున్నాయి. తెలంగాణలోని కవ్వాల్ టైగర్ జోన్ విస్తరించి ఉన్న ఆసిఫాబాద్ మంచిర్యాల ఆదిలాబాద్ అటవీ ప్రాంతాలు ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతాలు, బెల్లంపల్లి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల ప్రాంతాల్లో సైతం పులుల సంచారం ఎక్కువగా ఉంది. నిన్న పులిదాడిలో ఓ యువకుడు చనిపోయిన విషయం తెలిసిందే. విఘ్నేష్ అనే 22 ఏళ్ల యువకుడిని నోట కరుచుకుని అడవిలోకి పులి లాక్కెళ్లింది. ఈ దారుణ ఘటన ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం దిగిడ శివారులో ఘటన చోటు చేసుకుంది.
ఈ పులి దాడిలో గిరిజన యువకుడు విఘ్నేష్ మృతి చెందగా. మరో ఇద్దరు పరుగులు తీసి తప్పించుకొని ప్రాణాలు దక్కించుకున్నారు. ఘటనా స్థలాన్ని జిల్లా అటవీ శాఖ అధికారి శాంతారాం కాగజ్ నగర్ డీ ఎఫ్ వో విజయ్ కుమార్ పరిశీలించారు. దీంతో పులికోసం అధికారులు వేట కొనసాగించారు. అటవీ శాఖ అధికారులు పలుచోట్ల బోనులు ఏర్పాటు చేశారు. దిగిడ గ్రామాన్ని ఇవాళ గఇంచార్జీ ఎస్పీ సత్యనారాయణ సందర్శించనున్నారు. గూడెం గ్రామానికి మహారాష్ట్ర బార్డర్ నుంచి ఒకటే కిలోమీటర్. ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతం బార్డర్ 5 కిలోమీటర్లే దూరం.