అసెంబ్లీ ఎన్నికల్లో టిక్ టాక్ స్టార్

అసెంబ్లీ ఎన్నికల్లో టిక్ టాక్ స్టార్

హరియాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో టిక్‌టాక్‌ స్టార్‌ దిగనుంది. నాలుగు గోడల మధ్య ఉన్న ప్రతిభ టిక్‌ టాక్‌ వీడియోలతో సెలబ్రెటీలు అవుతున్నారు.

సొనాలీ ఫోగట్‌ అనే మహిళా లక్షలమంది ఫాలోవర్లతో టిక్టాక్ లో చాలాగుర్తింపు తెచ్చుకుంది. ఎంతో మంది ఫ్యాన్స్‌ ఉన్న ఈ మహిళకు అదంపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఏకంగా ఎమ్మెల్యే టికెట్‌ని బీజేపీ పార్టీ ప్రకటించింది.బీజేపీ పార్టీ విడుదల చేసిన రెండో జాబితాలో ఈ టిక్‌టాక్‌ స్టార్‌ పేరు నిలవడంతో షాకింగ్ న్యూస్ గా మారింది.

బీజేపీ అందపూర్‌లో ఎలాగైనా స్థానాన్ని కైవసం చేస్కొడానికి ఈ నిర్ణయం తీస్కుని ఉండి ఉంటుందని తెలుస్తుంది.అటు కాంగ్రెస్‌పార్టీ కుల్దీప్‌ బిషానికే టికెట్ ఇవ్వబోనున్నారని వార్తలు ఉన్నాయి.భజన్‌ లాల్‌కు చెందిన కుటుంబసభ్యులే ఎనిమిదిసార్లు జరిగిన గత ఎన్నికల్లో విజయాన్ని పొందారు. దీనివల్ల అదంపూర్‌ అసెంబ్లీ ఎన్నికలలో విజయం ఎవరిదనేది ఆసక్తికరంగా మారింది.