దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘హను-మాన్’ మూవీ తో ఎలాంటి క్రేజ్‌ని దక్కించుకున్నాడో అందరికీ తెలిసిందే. ఈ మూవీ తో ఆయన ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయారు . ఇక ఈ డైరెక్టర్ ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసి అందరిలో ఆసక్తిని క్రియేట్ చేశారు . ‘సింబ’ అనే మూవీ తో ప్రశాంత్ వర్మ మనముందుకు రాబోతున్నట్లు తాజాగా వెల్లడించాడు.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగానే ఈ మూవీ కూడా ఉండబోతుందని ఆయన తెలిపాడు. ఇక ఈ మూవీ లో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా టాక్ జోరుగా వినిపిస్తుంది . అయితే, దీనిపై ఇంకా క్లారిటీ కూడా రావాల్సి ఉన్నది . ఇక ఈ మూవీ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ సెప్టెంబర్ 6న ఉదయం 10.36 గంటలకి చేయబోతున్నట్లు ప్రశాంత్ వర్మ తాజాగా ప్రకటించారు. అంతేగాక, ‘‘లెగసీని ముందుకు తీసుకెళ్లే సమయం ఆసన్నమైంది’’ అని అంటూ ప్రశాంత్ వర్మ ఒక క్లూ కూడా వదిలాడు.
దీంతో ఈ మూవీ లో మోక్షజ్ఞ తెరంగేట్రం దాదాపు ఖాయం అని నందమూరి అభిమానులు ఫిక్స్ అవుతున్నారు. ఈ మూవీ SLV సినిమాస్ బ్యానర్‌పై చెరుకూరి సుధాకర్ ప్రొడ్యూస్ చేయనున్నారని తెలుస్తుంది .