ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు స్కిన్ టోన్‌కి తగ్గట్టు బ్యూటీకి సంబంధించి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే రెగ్యులర్‌గా ఈ పద్ధతులను అనుసరించడం వల్ల అందంగా మీ స్కిన్‌ని అందంగా మార్చుకోమని స్పెషలిస్టులు చెప్పారు.
నేటి కాలంలో స్కిన్ కేర్ బాగా పాపులర్ అయింది. మహమ్మారి కాలంలో దీనిని చాలా మంది పాటిస్తూ వచ్చారు. స్కిన్ మినిమలిజం ఇప్పుడు ఎక్కువ మంది అనుసరించడం మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు వారి యొక్క జీవన విధానంలో దీనిని కూడా భాగం చేసుకున్నారు. అయితే ఇది చెప్పాలంటే చాలా అద్భుతమైన టెక్నిక్ అనే చెప్పాలి.
మరి స్కిన్ కేర్ స్పెషలిస్ట్స్ దీనికి సంబంధించి ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం చూసేద్దాం. మరి ఆలస్యం ఎందుకు వాటి కోసం ఇప్పుడు పూర్తిగా చూసేయండి.సాధారణంగా బ్యూటీ ప్రొడక్ట్స్‌ని మాత్రమే ఉపయోగిస్తే అందం పెరిగిపోదు. కొన్ని స్టెప్స్ అనుసరించి కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్‌ని ఉపయోగించి ఫాలో అయితే తప్పకుండా మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. మరి ఇక వాటి కోసం ఒక లుక్ వేసేయండి.
మొట్టమొదట అన్నిటికంటే ముఖ్యమైనది క్లెన్సింగ్. నిద్రపోయేటప్పుడు చాలా మంది మేకప్‌ని అలానే వదిలేస్తారు. అది నిజంగా చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పవచ్చు. రాత్రి నిద్ర పోయేటప్పుడు మేకప్ లేదా చెమటని అలాగే వదిలేస్తే మీరు చర్మ సమస్యలకు స్వాగతం పలికినట్టు అని గుర్తు పెట్టుకోండి. దీనితో చర్మానికి వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. కాబట్టి ఎప్పుడూ కూడా చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. క్లెన్సింగ్ అనేది చాలా ముఖ్యమైన భాగం. ప్రతి రోజు మీరు క్లెన్సింగ్కి కాస్త సమయాన్ని వెచ్చించండి. మీ స్కిన్ టైప్‌కి తగ్గ విధంగా క్లెన్సింగ్ని ఉపయోగించండి.
అయితే డ్రై స్కిన్ వాళ్లకి క్రీమ్ బేస్డ్ క్లెన్సింగ్ చేస్తే మేలు చేస్తుంది. ఒకవేళ కనుక ఆయిల్ స్కిన్ వాళ్ళకి అయితే ఫోమ్ బేస్డ్ క్లెన్సర్ బాగా ఉపయోగ పడుతుంది. కాటన్ ప్యాడ్ సహాయంతో క్లెన్సర్ ఉపయోగించి వైప్ తో మొత్తం ముఖమంతా కూడా క్లీన్ చేసుకోండి. ఈ స్టెప్ని తప్పక రెగ్యులర్‌గా ఫాలో అయితే మంచి బెనిఫిట్స్‌ని పొందొచ్చు.
ఎక్స్ఫోలియేషన్ అంటే ఏమిటి అనే విషయంలోకి వస్తే… డెడ్ స్కిన్ ని తొలగించడం. ప్రతి రోజు కూడా డెడ్ స్కిన్ ని తొలగించడం చాలా ముఖ్యం. డెర్మటాలజిస్ట్ ఈ టెక్నిక్‌ని తప్పక పాటించాలి అని చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల చర్మం మరింత అందంగా బ్రైట్‌గా స్కిన్ కనబడుతుంది మరియు ఏదైనా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ని మీ ముఖంపై ఉపయోగిస్తే చక్కటి లాభం పొందొచ్చు. దీని గురించి మరిన్ని వివరాలను చూస్తే..
నార్మల్ స్కిన్ వాళ్లకి AHA బెస్ట్ అని డెర్మటాలజిస్ట్ అన్నారు. అదే డ్రై స్కిన్ మరియు సెన్సిటివ్ స్కిన్ వాళ్లకి అయితే BHA వాడమంటున్నారు. ఆయిల్ లేదా యాక్నీ స్కిన్ వాళ్లకి సీరమ్స్ మంచిది అని అంటున్నారు. కాబట్టి ఎక్స్ఫోలియేషన్ కోసం ఈ విధంగా ఎవరి స్కిన్ కి తగ్గట్టు వాళ్లు వాడడం మంచిది. దీనితో కూడా మీకు మంచి లాభాలు మీకు కనపడతాయి.
అదే విధంగా చర్మానికి హైడ్రేషన్ కూడా చాలా ముఖ్యం. చర్మం పొడిబారి పోకుండా ఎప్పటికప్పుడు హైడ్రేట్ గా ఉండేటట్టు చూసుకోవాలి. మంచి మాయిశ్చరైజర్‌ని రెగ్యులర్ గా వాడడం వల్ల నేచురల్ గ్లో పెరుగుతుంది.డ్రై స్కిన్ వాళ్లకి క్రీం బేస్డ్ మాయిశ్చరైజర్ మరియు ఆయిల్ ఉండే వాటిని వాడడం మంచిది ఆయిల్ మరియు కాంబినేషన్ స్కిన్ అయితే జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ వాడడం మంచిది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మంచి సన్ స్క్రీన్ లోషన్ వాడుకోవడం మంచిది.
సూర్య కిరణాల కారణంగా చర్మం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రెగ్యులర్‌గా సన్ స్క్రీన్ ని వాడండి. ఎప్పుడూ కూడా సన్ స్క్రీన్ వాడేటప్పుడు ఎస్పిఎఫ్ 30 కంటే ఎక్కువ ఉండే వాటిని ప్రిఫర్ చేయండి. బయటకు వెళ్ళకుండా ఇంట్లో ఉన్నా సరే సన్ స్క్రీన్ లోషన్ రాసుకోండి.ఇలా రెగ్యులర్ గా మీరు సన్ స్క్రీన్ ని వాడడం వల్ల మీ చర్మం అందంగా, షైనీగా ఉంటుంది ఈ చిన్న చిన్న టెక్నిక్‌ని మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వడం వల్ల మీ చర్మానికి ఎన్నో బెనిఫిట్స్ కలుగుతాయి.
పైగా మీరు ఇప్పుడు ఉన్నంత కంటే కూడా అందంగా మారొచ్చు. అలానే ఈ టిప్స్ కూడా చాలా చిన్న చిన్నవి. ఇందులో పెద్ద కష్టం ఏమీ కూడా లేదు. కాబట్టి రెగ్యులర్ గా అనుసరించి మరింత అందంగా మారిపోండి. దీనితో చర్మ సమస్యలకి కూడా మీరు చెక్ పెట్టేయచ్చు.a