చర్మ సంరక్షణపై ఆసక్తి కలిగి ఉండటం చాలా ముఖ్యం అయినప్పటికీ చాలా మంది తమ చర్మం ఆకృతిపై శ్రద్ధ చూపరు. చలికాలం సమీపిస్తున్న కొద్దీ చర్మం పొడిబారినట్లు, సాగినట్లుగా అనిపిస్తుంది. చర్మం కాంతివంతంగా కనిపించదు. అందువల్ల చర్మ సంరక్షణ దినచర్య మారాలి. కానీ దాని కోసం చర్మం స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ సీజన్లోనే గాలిలో తేమ బాగా తగ్గడం జరుగుతుంది. ఇలా అవ్వడం వల్ల ప్రధానంగా చర్మం పొడిబారటం, పగలటం, మంటపెట్టడం, చిటపటలాడటం, దురద పెట్టడం వంటి సమస్యలు బాగా వస్తాయి. ఈ కాలంలో డ్రై స్కిన్ ఉన్నవారికి ఇబ్బందులు మరీ ఎక్కువగా వస్తుంటాయి. ఇక జిడ్డు చర్మం వారికి కూడా సమస్యలు తప్పవు.
డ్రై స్కిన్ , డీహైడ్రేటెడ్ స్కిన్ అంటూ వీటిపై కొంత గందరగోళం ఉంది. చలికాలపు వాతావరణ పరిస్థితుల వల్ల మీ చర్మం సహజమైన నూనెను కోల్పోతుంది. దీనివలన మీ చర్మం పొడిగా, కఠినంగా, నిర్జీవంగా మారుతుంది. అదే డీహైడ్రేటెడ్ స్కిన్ అంటే చర్మంలో తగినంత శాతం నీరు లేకపోవడం. చర్మం తీరు ఇలా ఉన్నా ఇబ్బందులు కలుగుతాయి. డీహైడ్రేటెడ్ స్కిన్ కలిగిన వాళ్లలో చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందువల్ల ఇలాంటి వాళ్లు శీతాకాలంలో ఎక్కువగా మాయిశ్చరైజింగ్ క్రీములు వాడాల్సి ఉంటుంది.
చలికాలంలో ఇంటివద్దే కొన్ని టిప్స్ పాటిస్తే.. మీ ముఖం కాంతివంతంగా తయారవుతుంది. చలికాలంలో దొరికే పళ్లతో ఇంటి వద్ద ఫేస్ ప్యాక్ చేసుకుంటే ముఖం మీద ఉన్న చర్మం కాంతివంతంగా మారుతుంది. చలికాలంలో దొరికే నారింజ, యాపిల్, అరటిపండు.. వీటితో ఫేస్ ప్యాక్ లను చేసుకోవచ్చు. నారింజ తొక్కలను ఎండబెట్టి ఆ తొక్కలను పొడి చేసి ఆ పొడిలో కొద్దిగా తేనె, కొంచెం యోగర్ట్, కొంచెం ఓట్ మీల్ వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. తర్వాత దాన్ని ముఖానికి రాసుకోవాలి. కొంచెం సేపు తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. దీంతో ముఖం మీద ఉన్న చర్మం తేజోవంతంగా తయారవుతుంది.
యాపిల్ పండు పైన ఉండే తోలు తీసేసి దాని గుజ్జును మెత్తగా చేసి… దానికి కొంచెం తేనె కలిపి పేస్టులా తయారు చేయండి. ఆ పేస్టును ముఖానికి పెట్టుకోండి. కొంచెం సేపు తర్వాత దాన్ని వేడినీళ్లతో కడుక్కోవాలి. బాగా పండిన రెండు అరటి పళ్లను తీసుకొని.. వాటి పొట్టు తీసి పళ్లను గుజ్జు గుజ్జుగా చేసుకోవాలి. ఆ గుజ్జుకు కొంచెం తేనె, ఓ స్పూన్ యోగర్ట్ కలిపి పేస్టులా చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోండి. కొంతసేపటి తర్వాత నీళ్లతో కడిగేయండి. అంతే మీ చర్మం కాంతివంతమవుతుంది.
శీతాకాలంలో ఎక్కువగా చల్లదనం కారణంగా బాగా వేడిగా ఉండే నీటితో స్నానం చేస్తారు. కానీ అలా చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. చలిని పోగొట్టుకోవాలంటే గోరు వెచ్చని నీటినే స్నానానికి ఉపయోగించాలి. వేడి నీటి వల్ల చర్మంలో సహజ సిద్ధంగా ఉండే ఆయిల్స్ పోతాయి. దీంతో చర్మం పొడిగా మారుతుంది. ఇక గోరు వెచ్చని నీటితో స్నానం చేసేటప్పుడు అందులో కొద్దిగా కొబ్బరినూనె ఉండేలా చూసుకోవాలి. దాంతో చర్మం మృదువుగా మారుతుంది.
చలికాలంలో ప్రతి ప్రతిఒక్కరు చేసే తప్పేంటంటే నీటిని సమృద్ధిగా తీసుకోకపోవడం. ఇలా చేయడం తప్పు అని నిపుణులు అంటున్నారు. రోజూ తగినంత మోతాదులో నీటిని త్రాగితే చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. దీంతో చర్మం మృదువుగా ఉండి తేమను కోల్పోకుండా ఉంటుంది.
విపరీతమైన చలి కారణంగా ఉదయం లేవగానే చర్మం పొడిగా మారుతుంది. దానికి రాత్రివేళ నిద్రపోయే ముందే చర్మానికి పగుళ్ల నివారణ క్రీములు రాసుకుంటే మంచిది. చలి కాలంలో నీరు తాగాలని అనిపించదు. దాంతో నీరు తాగడం మర్చిపోతాం. కానీ, క్రమం తప్పకుండా నీరు తాగాలి. నీరు తీసుకోవడం ద్వారా చర్మ పొడిబారిపోవడం తగ్గిపోతుంది. కావాలంటే మీరు రెగ్యులర్‌గా నీరు తాగి చూడండి. తేడా మీకే తెలుస్తుంది.
మీరు సమ్మర్ లేదా వానాకాలంలో వాడే మాయిశ్చరైజర్ ఇప్పుడు పనికి రాదు. ఇంకా రిచ్‌గా, ఆయిల్ బేస్‌గా ఉండే మాయిశ్చరైజర్ తీసుకోండి. వీలున్నంత వరకూ ఆర్గానిక్ ప్రొడక్టులు వాడడం మంచిది.వింటర్లో హ్యుమిడిటీ తక్కువగా ఉంటుంది. అందుకే ఒక హ్యుమిడిఫైయర్‌ను ఇంట్లో ఇన్స్టాల్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ ఉండదు.యాంటీ ఆక్సిడెంట్ ఉన్న కూరగాయలను తీసుకోండి. చిలగడదుంపలు, క్యారెట్స్, క్యాప్సికం, గుమ్మడికాయ వంటి వాంటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ చర్మానికి మేలు చేస్తాయి. విటమిన్స్ ఏ, బీ, ఈ, ఐరన్ ఉంటాయి.
మీ చేతులు మెత్తగా మృదువుగా లేవంటే మీకు ఒమేగా 3 సరిపడినంత లేదని కూడా సూచన కావచ్చు. సాల్మన్, ఆలివ్ ఆయిల్, వాల్‌నట్స్‌లో ఈ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి.రసాయనాలతో కూడిన సబ్బులు వాడకండి: శరీరంలో చర్మం అతి పెద్ద అవయవం. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలంటే ఆల్కహాల్, ఫ్రాగ్రెన్స్ , రసాయనాలు ఉన్న సబ్బులను వాడకండి. ఇవి చర్మం మీద సహజంగా ఉండే నూనెలను తీసేస్తాయి.
ఈ కాలంలో వేడి నీటి స్నానం వల్ల హాయిగా ఉంటుంది కానీ, స్కిన్‌కు మాత్రం అది హాని చేస్తుంది. అందుకే గోరు వెచ్చని నీటితోనే స్నానం చేయండి.కొబ్బరి నూనె స్కిన్ కేర్‌లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగిన డ్యామేజ్‌ను తగ్గిస్తుంది. స్కిన్ యంగ్‌గా కనిపించేలా చేస్తుంది.దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ సెల్ ఏజీయింగ్ను అడ్డుకుంటాయని పరిశోధనల్లో తెలిసింది. దానిమ్మ పండు తిన్నా, జ్యూస్ తాగినా మంచిదే.