సరిపడా నీళ్లు తీసుకుంటే ఎముకలు దృఢంగా ఉంటాయి కూడా. కనుక నీళ్లు తీసుకుంటూ ఉండాలి. నిజానికి నీళ్లు చాలా అవసరం చాలా మంది నీళ్ళే కదా అని లైట్ తీసుకుంటూ ఉంటారు.ఇదిలా ఉంటే చాలా మందికి నిద్ర లేవగానే దాహం వేస్తుంది. వెంటనే వాళ్ళ మంచం పక్కన ఉన్న బాటిల్ తీసుకొని నీళ్లు తాగుతూ ఉంటారు. అయితే రాత్రంతా కూడా నిల్వ ఉంచిన నీళ్ళని ఉదయాన్నే తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని కొంత మంది ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
కానీ మరి కొంతమంది దీని వలన సమస్యలు కలుగుతాయని.. ఇలాంటి తప్పులు చేయొద్దని మరి కొందరు అంటున్నారు.ఇలా నిల్వ ఉంచిన నీళ్లు తాగడం వల్ల అదిరిపోయే ప్రయోజనాలు మనం పొందవచ్చు.మనుషుల యొక్క బాడీ 70 శాతం నీటితో నిండి ఉంటుంది. దీనిని తీసుకోవడం చాలా ముఖ్యం. నీళ్లు తీసుకోవడం వల్ల బాడీ టెంపరేచర్ మెయింటెన్ చేయొచ్చు. అలానే చెమటను, యూరిన్, జాయింట్ లూబ్రికేట్ కోసం నీళ్లు అవసరమవుతాయి.
నిల్వ ఉంచిన నీళ్లు అంటే రాత్రంతా వదిలేసిన నీళ్లు. నీళ్లకి మూత పెట్టకుండా రాత్రంతా అలా వదిలేస్తే కార్బన్ డయాక్సైడ్ దాంతో కలుస్తుంది. దీంతో పీహెచ్ లెవెల్ తగ్గుతుంది. అయితే ఆరోగ్యకరమైన వ్యక్తి ఇలా నిల్వ ఉంచిన నీళ్లు తాగడం చాలా ముఖ్యం. అదే ఒకవేళ కనుక ఆ నీళ్ళని తాగే వారికి అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే వాళ్లకి మరింత ఇబ్బంది కలుగుతుందని నిపుణులు తెలిపారు. ఎందుకంటే వాళ్లలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందుకని సరిగా స్టోర్ చేసిన దానిలో నీళ్లు మాత్రమే తాగాలి. ఇలా తాగితే ఎటువంటి ఇబ్బంది ఉండదు.
నీళ్ళను మూత పెట్టకుండా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని ఇది కలుషితం అవుతుందని తెలిపారు. అలానే మనం ఉండే చోట చెత్తాచెదారం చిన్న చిన్న క్రిములు ఉంటాయి. ఇవి నీళ్ళల్లో పడతాయని దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. అలాగే మనం ఉపయోగించే బాటిల్ లేదా గ్లాస్‌తో నీళ్లను ఉంచిన కాసేపటికి దుర్వాసన వస్తుంది. కాబట్టి ప్రతి సారి కూడా వాడుకున్నాక శుభ్రం చేసుకోవడం ముఖ్యం. ఇలా చేయలేదు అంటే బాక్టీరియా మరియు వైరస్ వస్తాయి.
అలానే ఆరోగ్య నిపుణులు కార్లలో వాటర్ బాటిల్స్‌ని వదిలేసి ఆ నీటిని తీసుకోవద్దు అని అంటున్నారు. అలాగే ఎక్కువ సేపు ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీరు నిల్వ ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. ముఖ్యంగా కార్లలో వేడి ఎక్కువ ఉంటుంది. బ్యాక్టీరియాను కూడా అది పెంపొందిస్తుంది కాబట్టి ఇలాంటి నీళ్లు తాగుతున్నట్టయితే మానుకోండి.
నీళ్ళని ఎలా స్టోర్ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. రాత్రంతా నిల్వ ఉంచిన నీళ్లు తాగడం మంచిది కాదని అంటున్నారు. ఉదయం లేచిన తర్వాత ఫ్రెష్‌గా ఉండే నీళ్లను పట్టుకుని తీసుకుంటే మంచిది. ఇలా నిల్వ ఉంచిన నీళ్లు తీసుకోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి అని అంటున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌లో నీళ్ళు నిల్వ ఉంచితే వాటిని తీసుకోకూడదు. బాటిల్స్‌లో వుండే కెమికల్స్ ఉంటాయి. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి.
పూర్వీకులు అయితే మట్టి పాత్రల్ని కానీ కాపర్ పాత్రలను ఉపయోగించే వారు అటువంటివి సేఫ్. ఆయుర్వేదం ప్రకారం కాపర్ బాటిల్లో స్టోర్ చేసిన నీళ్లు తీసుకుంటే మంచిదని డాక్టర్ అన్నారు. అయితే ప్రతి రెండు వారాలకు ఒకసారి కాపర్ బాటిల్స్‌ని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. రాగి పాత్రలు శుభ్రం చేసుకో పోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కాబట్టి తప్పకుండా రెగ్యులర్‌గా క్లీన్ చేస్తూ ఉండండి. అయితే రాగి పాత్రలును ఎలా శుభ్రం చేయాలి అనే దాని గురించి కూడా ఇప్పుడు చూద్దాం. మరి దీని కోసం ఒక లుక్ వేసేయండి.
కాపర్ వాటిని శుభ్రం చేసుకోవడానికి నిమ్మ మరియు సాల్ట్ బాగా ఉపయోగ పడుతుంది. మీరు కాపర్ వాటిని శుభ్రం చేయడానికి నిమ్మ కాయ ని కట్ చేసి దానిని ఉప్పు లో ముంచి రాగి పాత్రలు శుభ్రం చేయడానికి వాడండి. మీరు కావాలంటే నిమ్మ రసం వేసుకుని కూడా క్లీన్ చేసుకోవచ్చు. కొద్దిగా బేకింగ్ సోడాని కూడా మీరు క్లీన్ చేయడానికి ఉపయోగించవచ్చు.
ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ లో కొద్దిగా వెనిగర్ వేసి దానితో మీరు రాగి పాత్రలను శుభ్రం చేయండి. ఇలా రాగి వాటిని శుభ్రం చేసుకుంటే దానిలో ఉండే క్రిములను కూడా పోతాయి అలానే పాత్రలు మెరుస్తాయి కూడా. చూశారు కదా ఆరోగ్య నిపుణులు మన తో ఎంతో అద్భుతమైన చిట్కాలను షేర్ చేసుకున్నారు. మరి మీరు ఫాలో అయ్యి అనారోగ్య సమస్యలు లేకుండా ఉండండి. అదే విధంగా ఎటువంటి తప్పులు చేయకుండా ఆరోగ్యంగా ఉండండి.