భారీ భద్రత తో తిరుమల

భారీ భద్రత తో తిరుమల

కోట్లాది మంది తో కళకళలాడుతూ ఉండే తిరుమలకు, ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ రాకుండా చూసేందుకు టీటీడీ కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకుంటుంది. తిరుమ శ్రీవారిని దర్శించుకోడానికి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా అలిపిరి, శ్రీవారి మెట్టు తదితర ప్రాంతాల్లో థర్మల్ గన్ లను అందుబాటులో ఉంచి, వారికి అక్కడే కరోనా వైరస్ కి సంబందించిన పరీక్షలు చేస్తున్నారు. కాగా ఈరోజు నుండి కొండ పైకి ఎక్కే ప్రతీ ఒక్కరిని కూడా ఆ థర్మల్ గన్ లతో పరీక్షించనున్నారు.

కాగా భక్తులకు వారి శరీరంలో జ్వరానికి సంబందించిన లక్షణాలు కనిపించకపోతేనే వారిని కొండా పైకి అనుమతించనున్నారు.ఒకవేళ వారికి వారి శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంటె, పక్కనే ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ సెంటర్ లో తదుపరి పరీక్షలు నిర్వహిస్తామని టీటీడీ అధికారులు వెల్లడించాడు. కాగా ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా, ఆ మహమ్మారి కరోనా వైరస్ వ్యాపిస్తూనే ఉంది. కాగా ఈ వైరస్ కారణంగా గురువారం నాడు దేశంలో మొదటి మరణం సంభవించిందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.