తిరుపతి: రాత్రి గస్తీల్లో డ్రోన్‌..

ఇప్పటి వరకు రాత్రి గస్తీల కోసం కేవలం బ్లూకోల్స్ట్‌, రక్షక్‌ పోలీసులు మాత్రమే రోడ్లపై తిరిగేవారు. అన్ని వీధులు, సందులు, గొందుల్లోకి వెళ్ళడానికి వీరికి సాధ్యపడే పని కాకుండా పోయింది. ఈ క్రమంలో రాత్రి గస్తీకి డ్రోన్‌ వినియోగించాలని ఎస్పీ హర్షవర్ధనరాజు భావించారు. దీనికిగాను అత్యంత శక్తిమంతమైన మ్యాట్రిక్‌ 4 థర్మల్‌ డ్రోన్‌ కెమెరా వినియోగించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం అర్ధరాత్రి తిరుపతి, శివారు ప్రాంతాల్లో డ్రోన్‌ ఎగురవేసి రాత్రి పహారా కాశారు. ఒక్కో జోన్‌లో ఒక్కో రాత్రి డ్రోన్‌ నిఘా ఉంచుతారు. ఇది అరకిలోమీటరుకు పైగా నింగిలోకి వెళ్లి.. మూడు కిలోమీటర్ల వ్యవధిలో కవర్‌ చేస్తుంది.