గుణపాఠం చెప్పిన దున్నపోతు…ఏం చేసిందో చూస్తే ఆశ్చర్యపోతారు…..

వృక్షో రక్షితి రక్షతః అంటారు. అంటే చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడాతాయి అని అర్థం. ఇది అన్నింటికీ అన్వయించుకోవచ్చు. ఎదుటి మనిషికి మనం గౌరవిస్తే.. తిరిగి మనం గౌరవించబడతాం. అలాగే.. జంతుజాలం కూడా. గేదెలు, ఆవులు, ఎడ్లు, దున్నలు మానవాళికి ఎంతగా సహాయ పడతాయో తెలిసిందే. అయితే  మూగజీవాలను బాగా చూసుకుంటే అవి మనకు వ్యవసాయ పనులు, ఇతర పనుల్లో ఎంతో అండగా నిలుస్తాయి. కానీ మానవత్వం మరిచిపోయి మానవుడు మూగజీవుల పట్ల అతిగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.

అసలేం జరిగింది అంటే.. ఐదుగురు వ్యక్తులు బండిపై కూర్చొని దున్నతో నడుపుతున్నారు. అదే సమయంలో ఆ దున్నకు ఊపిరాడనంత పని చేసి దాన్ని నడిరోడ్డుపై పరుగులు పెట్టించారు. దాంతో ఆ దున్న చేసే దేమీలేక వెనక నుంచి కొడుతున్నా కూడా కొంత దూరం వరకు అందరిని మోసుకుంటూ తీసుకెళ్లి వాళ్ల సరదా తీర్చింది. ఆ మధ్యలో డివైడర్‌ క్రాసింగ్‌ రావడంతో దున్నకు చిర్రెత్తుకొచ్చిందే ఏమో.. డివైడర్‌పై బండి ఎక్కించింది. వేగం ఎక్కువగా ఉండటంతో బండిపై ఉన్నవారంతా ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. మొత్తానికి తాను ఆ వారి నుంచి తప్పించుకున్నాను అనుకొని దున్నపోతు అక్కడి నుంచి పరారు అయింది. ఆ యువకులకు మాత్రం బుద్ధి వచ్చింది. కాగా దీంతో మానవత్వం మరిచి పోయిన మనుషులపై దున్నపోతు ప్రతీకారం తీర్చుకుంది అంటూ ట్విట్టర్‌ యూజర్‌ వరున్‌ సింగ్‌ వీడియోను పోస్ట్‌ చేశాడు. ఇది నెట్ లో వైరల్ గా మారింది.