టైటానిక్ పేరు వినగానే అందరికి ఆ పేరుతో వచ్చిన హాలీవుడ్ సినిమానే గుర్తుకొస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యం పొందిన టైటానిక్ షిప్ మంచుకొండను ఢీకొని 1912 సంవత్సరంలో సముద్రంలో మునిగిపోయింది. ఇప్పుడు రెండో టైటానిక్ రయ్యిరయ్యిమంటూ దూసుకెళ్లడానికి సిద్ధమవుతున్నది. ప్రస్తుతం అలాంటి నౌక నిర్మాణం జరుగుతుంది. మొదటి టైటానిక్ ప్రమాదం జరిగిన 110 సంవత్సరాలకు రెండో టైటానిక్ షిప్ రాబోతుండం విశేషం. 2022లో ఈ నౌక తన తొలి ప్రయాణ ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. తొలి టైటానిక్ ప్రయాణించిన మార్గంలోనే టైటానిక్-2 ను కూడా నడుపాలని బ్లూ స్టార్ లేన్ సంస్థ నిర్ణయించింది. తొలి టైటానిక్‌లో ప్రయాణిస్తూ ప్రేమలో పడిన రోస్-జాక్‌ల తరహాలో ఈసారి ఎవరైనా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తారా? అన్న అంశం మీద ఎక్కువ చర్చ జరుగుతున్నది. పూర్తి విశేషాల కోసం వీడియో వీక్షించండి..!