చీకటి ఉండే చోట వెలుగులు నింపాలని..

తెలంగాణ లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటిస్తున్నారు. కొమురం భీం జిల్లా లోని కాగజ్‌నగర్‌ లో రూ. 3,694 కోట్లతో ఐదు జాతీయ రహదారులను ప్రారంభించారు. ఈ సందర్బంగా చీకటి ఉండే చోట వెలుగులు నింపాలని, ఆదిలాబాద్‌ జిల్లా ప్రజల సమ్యలు అర్థం చేసుకునే రోజు వచ్చిందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పీఎం సడక్‌ యోజన కింద దేశవ్యాప్తంగా రోడ్లు నిర్మిస్తోందని, రోడ్లు బాగున్న దేశాన్నే అభివృద్ధి చెందిన దేశంగా భావిస్తారని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.