ఇవాళ చంద్రబాబుకు AIG ఆసుపత్రిలో కంటికి ఆపరేషన్

AP Politics: CID charge sheet in IRR case.. Chandrababu as A-1
BREAKING NEWS: Big relief for Chandrababu in Supreme Court..

హైదరాబాద్ AIG ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. బ్లడ్, యూరిన్, ఈసీజీ, 2డి ఎకో, కాలేయం – మూత్రపిండాల పనితీరు, అలర్జీ స్క్రీనింగ్, గుండె సంబంధిత టెస్టులు చేసినట్లు సమాచారం. డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, పల్మనాలజీ నిపుణుల సూచనల మేరకు అడ్మిట్ అయి చికిత్స తీసుకున్నారు.

ఇవాళ జూబ్లీహిల్స్ లోని ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ లో కంటికి ఆపరేషన్ చేయించుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయి 50రోజులకు పైగా రాజమహేంద్రవరం కారాగారంలో ఉన్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఆయనకు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల కోసం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వచ్చారు. ఏపీలోని ఉండవల్లి నుంచి భాగ్యనగరానికి వచ్చిన బాబుకు.. అడుగడుగునా అభిమానులు, టీడీపీ కార్యకర్తలు నీరాజనం పట్టారు.