జాబిల్లిపైకి నేడు జపాన్‌ లూనార్‌ మిషన్‌ ప్రయోగం..!

JAXA
JAXA

ప్రపంచ దేశాలు వరుసగా జాబిల్లిపై పరిశోధనలు చేస్తున్నాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి చంద్రయాన్-3 చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ప్రపంచంలో జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్​ హిస్టరీ క్రియేట్ చేసింది. ఇటీవలే రష్యా కూడా లూనా-25 ప్రయోగం చేసింది. కానీ అది విఫలమైంది. ఇక తాజాగా జాబిల్లిపై అడుగుపెట్టేందుకు జపాన్‌ కూడా రంగం సిద్ధం చేసింది.

చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్‌ను సాఫ్ట్‌ ల్యాండ్‌ చేయడమే లక్ష్యంగా ప్రయోగానికి రెడీ అవుతోంది. స్మార్ట్‌ ల్యాండర్‌ ఫర్‌ ఇన్వేస్టిగేటింగ్‌ మూన్‌ (స్లిమ్‌) పేరిట జపాన్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ జాక్సా ఇవాళ చంద్రుడిపైకి వ్యోమ నౌకను పంపించనుంది. హెచ్‌2-ఏ రాకెట్‌ జాక్సా టనేగషిమా స్పేస్‌ సెంటర్‌లోని యోషినోబు లాంచ్‌ కాంప్లెక్స్‌ నుంచి నేడు నింగిలోకి దూసుకెళ్లనుంది. నాసా, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ సహకారంతో చేస్తున్న ఈ ప్రయోగం సఫలమైతే జాబిల్లిపై ల్యాండర్‌ను సాఫ్ట్‌ ల్యాండ్‌ చేసిన ఐదో దేశంగా జపాన్‌ అవతరించనుంది.