8వ ఖండం కూడా ఉందని కనుగొన్న శాస్త్రవేత్తలు…!

Scientists have discovered that there is also an 8th continent...!
Scientists have discovered that there is also an 8th continent...!

ప్రస్తుతమున్న 7 ఖండాలే కాకుండా మరో ఖండం కూడా ఉందా?.. అనే సందేహాలకు ఔననే సమాధానమిస్తున్నారు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు. భూమిపై ఖండాలెన్ని అని అడిగితే వెంటనే 7, అవి ఆసియా, ఆఫ్రికా, యూరప్, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా అని చెబుతాం. కానీ 8వ ఖండం కూడా ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. 375 ఏళ్లుగా తప్పిపోయిన ఓ ఖండాన్ని కనుగోన్నారు. అయితే దాదాపుగా 94 శాతం నీటి అడుగు భాగాన కొత్త ఖండం ఉండిపోయింది. సెస్మాలజిస్టులు, జియోలజిస్టులతో కూడిన ఓ పరిశోధన బృందం ‘జిలాండియా లేదా లె రియు-ఎ-మౌయి’ అని పిలువబడే ఖండం మ్యాపును రూపొందించారు. పరిశోధకులు సముద్రం అడుగు భాగంలోని రాళ్ల నమూనాల డేటాను విశ్లేషించడం ద్వారా దీన్ని కనుగొన్నారు.

దీనికి సంబంధించిన వివరాలు టెక్టోనిక్స్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి.బీబీసీ ప్రకారం జిలాండియా 4.9 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న విశాలమైన భూభాగం. ఇది మడగాస్కర్ తో పోలిస్తే ఆరు రెట్లు పెద్దది. కొత్తగా కనుగొన్న ఈ కాంటినెంట్ ప్రపంచంలోనే చిన్న, కొత్తదైన ఖండంగా పేరు సంపాదించుకుంది. ఈ ఖండం 94 శాతం నీటిలో ఉంది, న్యూజిలాండ్ మాదిరిగానే ద్వీపాలు ఉన్నాయి. సైంటిస్టుల అభిప్రాయం ప్రకారం జిలాండియాను స్టడీ చేయడం చాలా కష్టం. ప్రస్తుతం సైంటిస్టులు సముద్రం అడుగుభాగంలోని రాళ్లు, అవక్షేప నమూనాలను స్టడీ చేస్తున్నారు. వీటిలో చాలా వరకు డ్రిల్లింగ్ నుంచి కొన్ని ద్వీపాల తీర ప్రాంతాల నుంచి సేకరించారు. ఈ రాతి నమూనాలు పశ్చిమ అంటార్కిటికా, న్యూజిలాండ్ పశ్చిమ తీరంలోని క్యాంప్ బెల్ పీఠభూమి సమీపంలోని సబ్ డక్షన్ జోన్ పోలికను కలిగి ఉన్నాయి. కొత్తగా రూపొందించిన జిలాండియా మ్యాప్ దాని లొకేషన్ ని మాత్రమే కాకుండా, భౌగోళిక లక్షణాలను కూడా చూపుతోంది.జిలాండియా వాస్తవానికి కొన్ని మిలియన్ ఏళ్ల క్రితం ఉన్న సూపర్ కాంటినెంట్ అయిన గోండ్వానాలో భాగం. ఇది సుమారుగా 550 మిలియన్ ఏళ్ల క్రితం ఏర్పడింది. ఇది దక్షిణార్థ గోళంలో మొత్తం భూమిని కలిపి ఉంది.